Advertisement

Advertisement


Home > Movies - Interviews

ప్రభాస్ తో సినిమాపై అనుష్క రియాక్షన్

ప్రభాస్ తో సినిమాపై అనుష్క రియాక్షన్

లాంగ్ లాంగ్ గ్యాప్ తర్వాత సోషల్ మీడియాలో ఫ్యాన్స్ తో ఛాట్ చేసింది బొమ్మాలి అనుష్క. రీసెంట్ గా రిలీజైన తన నిశ్శబ్దం సినిమా విశేషాలతో పాటు.. తన వ్యక్తిగత జీవితానికి సంబంధించిన ఎన్నో వివరాల్ని షేర్ చేసింది. 

మీరూ ఓ లుక్కేయండి.

కొత్త సినిమాలు చెప్పండి?

త్వరలోనే ఆ ఎనౌన్స్ మెంట్స్ వస్తాయి. మేం అంతా సిద్ధమైన తర్వాత సదరు నిర్మాణ సంస్థల నుంచి ఆ ప్రకటనలు వస్తాయి.

మీ ఫేవరెట్ పాత్రలు?

అరుంధతి, వేదం, రుద్రమదేవి, భాగమతి, సైజ్ జీరో, నిశ్శబ్దం, నాన్న, తాండవం, బాహుబలి... ఈ సినిమాల్లో నేను చేసిన పాత్రలంటే ఇష్టం.

ప్రభాస్ తో మళ్లీ సినిమా ఎప్పుడు?

ఓ మంచి స్క్రిప్ట్ దొరికితే తప్పకుండా ప్రభాస్ తో మరో సినిమా చేస్తా.

భవిష్యత్తులో నెగెటివ్ పాత్రలు చేస్తారా?

అన్ని రకాల పాత్రలు చేయడానికి నేను రెడీ

మీరు సీక్రెట్స్ షేర్ చేసుకునేది ఎవరితో?

అదృష్టం కొద్దీ నా జీవితంలో మంచి స్నేహితులు, వ్యక్తులు చాలామంది ఉన్నారు.

అవకాశం వస్తే గతాన్ని మార్చాలనుకుంటారా.. లేక భవిష్యత్తును చూస్తారా?

ఏదీ మార్చాలని అనుకోను. నా జీవితంలో ఇప్పటివరకు జరిగిన ప్రతి మూమెంట్ నా మంచి కోసమే అనుకుంటాను. ఏదీ మార్చాల్సిన అవసరం లేదు.

మీ ఫేవరెట్ పుస్తకం?

ఆల్కమిస్ట్ (తెలుగులో పరశువేది)

బాలీవుడ్ లో ఏదైనా సినిమా చేసే ఆలోచన ఉందా?

అలాంటిదేం లేదు. ఇప్పుడు చేస్తున్న పనిని ఎంతో ప్రేమిస్తున్నాను. అంతేకాదు.. భాషతో సంబంధం లేకుండా మరిన్ని మంచి సినిమాలు చేయాలనుకుంటున్నాను. మన సినిమాలు మరింత మందికి చేరుతాయని ఆశిస్తున్నాను.  

లాక్ డౌన్ లో నేర్చుకున్న పెద్ద పాఠం?

మన జీవితంతో పాటు చుట్టుపక్కలున్న దేన్నీ మనం కంట్రోల్ చేయలేం. ప్రతి నిమిషాన్ని గౌరవించాలి, ఆస్వాదించాలి. చుట్టూ ఉన్న మనుషుల్ని ప్రేమించాలి.

ఇష్టమైన జంతువు?

నాకు డాల్ఫిన్స్ అంటే చాలా ఇష్టం

మీ జీవిత సూత్రం ఏంటి?

ఉన్నంతలో బెస్ట్ గా ఉండాలి. ప్రతి నిమిషాన్ని జీవించాలి. ప్రతి నిమిషం పట్ల కృతజ్ఞతతో ఉండాలి.

నిశ్శబ్దంలో సాక్షి పాత్ర కోసం ఎవరు ట్రైనింగ్ ఇచ్చారు?

హైదరాబాద్ కు చెందిన రమ్య వాళ్ల టీమ్ ట్రయినింగ్ ఇచ్చింది. ఇక సియాటెల్ లో అమెరికన్ సైన్ లాంగ్వేజ్ లో ఒలీవియా డన్ క్లే బాగా హెల్ప్ చేశారు. వీళ్లతో పాటు డైరక్టర్ హేమంత బాగా గైడ్ చేశాడు.

మీకు స్ఫూర్తి ఎవరు?

నా తల్లిదండ్రులు, నా యోగా గురువు. ఇక నా జీవితంలో ఎదురైన కొంతమంది వ్యక్తుల నుంచి చాలా మంచి విషయాలు నేర్చుకున్నాను. వాళ్లే నాకు స్ఫూర్తి.

మీకు బెంగాలీ వచ్చా? హౌరా బ్రిడ్జ్ చూశారా?

కోల్ కతాలో ఓ సినిమా కోసం షూటింగ్ చేశాం. అప్పుడు బ్రిడ్జితో పాటు చాలా ప్రదేశాలు చూశాను. అంతేకాదు.. నాకు ఓ బెంగాలీ ఫ్రెండ్ కూడా ఉన్నాడు.

జడ్జిమెంట్స్ పై నాకు ఎంతైనా మాట్లాడే హక్కుంది

హ‌రిబాబుకు అంతేనా

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?