అదే జ‌రిగితే టీడీపీ ప‌రిస్థితి ఏమిటి?

అమిత్ షాతో జ‌గ‌న్ మీటింగ్ జ‌రిగిన‌ప్పుడు ఆంధ్ర‌జ్యోతిలో త‌న అక్క‌సు రాత‌ల‌న్నీ రాసేసుకున్నారు. ఇప్పుడు మోడీతో జ‌గ‌న్ మీటింగ్ జ‌ర‌గ‌బోతోంది. ఇప్పుడెన్ని అక్క‌సు రాత‌లు రాస్తారో కానీ.. తెలుగుదేశం పార్టీ ఫ్యాన్స్ ను ఆంధ్ర‌జ్యోతి…

అమిత్ షాతో జ‌గ‌న్ మీటింగ్ జ‌రిగిన‌ప్పుడు ఆంధ్ర‌జ్యోతిలో త‌న అక్క‌సు రాత‌ల‌న్నీ రాసేసుకున్నారు. ఇప్పుడు మోడీతో జ‌గ‌న్ మీటింగ్ జ‌ర‌గ‌బోతోంది. ఇప్పుడెన్ని అక్క‌సు రాత‌లు రాస్తారో కానీ.. తెలుగుదేశం పార్టీ ఫ్యాన్స్ ను ఆంధ్ర‌జ్యోతి రాధాకృష్ణ అలా పిచ్చ‌వాళ్ల స్వ‌ర్గంలోకి తీసుకెళ్లే ప్ర‌య‌త్నంలో ఉన్నారు. వాళ్ల ఫూల్స్ ప్యార‌డైజ్ లో వాళ్లు ఊరేగుతుంటే.. రాజ‌కీయ ప‌రిణామాలు మాత్రం వేరే ర‌కంగా సాగుతూ ఉన్నాయి. 

ద‌క్షిణాదిన జ‌గ‌న్ ను మోడీ ఒక న‌మ్మ‌క‌మైన మిత్రుడుగా భావిస్తున్నార‌నే స్ప‌ష్ట‌త రానే వ‌స్తోంది. చంద్ర‌బాబు నాయుడు, ప‌వ‌న్ క‌ల్యాణ్ ల బుద్ధేంటో, జ‌గ‌న్ వ్య‌క్తిత్వం ఏమిటో మోడీకి కూడా బాగా అర్థం అయ్యింది ఇప్ప‌టికే. అందితే జుట్టు, అంద‌క‌పోతే కాళ్లు ప‌ట్టుకునే ర‌కాలు చంద్ర‌బాబు నాయుడు, ఆయ‌న పార్ట్ న‌ర్ ప‌వ‌న్ క‌ల్యాణ్.

వైఎస్ జ‌గ‌న్ మాత్రం అత్యంత హుందాగా వ్య‌వ‌హ‌రిస్తూ ఉన్నారు. త‌న తీరుతో జ‌నాల్లోనే కాదు, పై స్థాయిలో ఉన్న వారిలో కూడా విశ్వ‌స‌నీయ‌త‌ను పెంపొందించుకున్నారు వైఎస్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి. ఒక‌వేళ దీన్నీ కాదంటూ అని ప‌చ్చ వ‌ర్గాలు పేట్రేగిపోవ‌చ్చు, అందుకే వాళ్లు పిచ్చివాళ్ల స్వ‌ర్గంలో ఉన్నార‌నేది! చంద్ర‌బాబు నాయుడు, రాధాకృష్ణ‌లు ప‌చ్చ‌పార్టీ ఫ్యాన్స్ ను ఆ స్థాయికి తీసుకెళ్లిపోయారు. వాస్త‌వాల‌ను ఒప్పుకునే స్థితిలో వారి మెద‌ళ్లు ఉండ‌క‌పోవ‌చ్చు!

ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కేంద్ర కేబినెట్లో చేరుతుందా?  చేర‌దా? అనేది కాదు, ప‌చ్చ‌ప‌న్నాగాలు మాత్రం పార‌వ‌ని స్ప‌ష్టం అవుతోంది. ప్ర‌స్తుత ప‌రిస్థితుల్లో రాష్ట్ర ప్ర‌యోజ‌నాల‌ను దృష్టిలో ఉంచుకుని జ‌గ‌న్ ఎన్డీయేతో జ‌ట్టుక‌డితే! బ‌హుశా చంద్ర‌బాబు నాయుడుకు అంత క‌న్నా షాకింగ్ విష‌యం ఉండ‌క‌పోవ‌చ్చు.

ఇప్ప‌టికే బీజేపీ ప్రాపకం కోసం చంద్ర‌బాబు నాయుడు వంగ‌ని లోతు లేదు. ఇలాంటి క్ర‌మంలో కూడా జ‌గ‌న్ పార్టీనే మోడీ, అమిత్ షాలు ద‌గ్గ‌ర‌కు తీసుకుంటే.. టీడీపీ వ‌ర్గాల గొంతులో ప‌చ్చి వెల‌గ‌కాయ ప‌డిన‌ట్టే. ఎన్డీయేల‌కు చేరే ప‌క్షంలో జ‌గ‌న్ ష‌ర‌తులు ఉండ‌నే ఉంటాయి. వాటి ప్ర‌కారం చంద్ర‌బాబు నాయుడు అవినీతి బాగోతాల‌పై సీబీఐ విచార‌ణ త‌ప్ప‌నిస‌రిగా ఉంటుంది. 

ఏసీబీ విచార‌ణ విష‌యంలోనే తెలుగుదేశం పార్టీ గ‌గ్గోలు పెడుతూ ఉంది. స్టే తెచ్చుకుని ప‌బ్బం గ‌డుపుతూ ఉంది. ఎన్డీయేలోకి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ  చేరితే.. సీబీఐ విచార‌ణ‌, ఆ క‌థంతా వేరే ర‌కంగా ఉంటుంది. బహుశా అది టీడీపీకి పెద్ద పీడ‌క‌లే అయ్యే అవ‌కాశాలున్నాయి. 

బీసీలు ముద్దు..కాపులు వ‌ద్దు