11, 18న కుమ్మేసుకుంటున్నారు

ఈ ఏడాది టాలీవుడ్ లో పరిస్థితి చిత్రంగా వుంది. ప్రతినెల ఏదో ఒక డేట్ కు భలే క్రేజ్ వచ్చేస్తోంది. ఆ డేట్ న పోటాపోటీగా సినిమాలు వచ్చేస్తున్నాయి. నవంబర్ 11 డేట్ కూడా…

ఈ ఏడాది టాలీవుడ్ లో పరిస్థితి చిత్రంగా వుంది. ప్రతినెల ఏదో ఒక డేట్ కు భలే క్రేజ్ వచ్చేస్తోంది. ఆ డేట్ న పోటాపోటీగా సినిమాలు వచ్చేస్తున్నాయి. నవంబర్ 11 డేట్ కూడా చూస్తుంటే అలాగే తయారయ్యేలా కనిపిస్తోంది. ఇప్పటికి అనుకున్న ప్రకారం అల్లరినరేష్-నాగేశ్వర రెడ్డి-భోగవిల్లి ప్రసాద్ ల ఇంట్లో దెయ్యం నాకేం భయం సినిమా విడుదల ఫిక్స్ చేసారు. 

ఇప్పుడు అదే డేట్ న నాగచైతన్య-గౌతమ్ మీనన్ ల సాహసం శ్వాసగా సాగిపో సినిమా విడుదల వుంటుంది. ఆలస్యమైనా ఈ సినిమా మీద కాస్త ఆసక్తి వుంది జనాల్లో. ఎందుకంటే గౌతమ్ మీనన్ మీద కాస్త నమ్మకం ఇంకా మన ప్రేక్షకులకు మిగిలే వుంది. 

ఇదిలా వుంటే రాధామోహన్ నిర్మించిన నవీన్ చంద్ర-సత్తిబాబు కాంబినేషన్ సినిమా మీలో ఎవరు కోటీశ్వరుడు కోసం కూడా ఇదే డేట్ ను పరిశీలిస్తున్నారు. వెనక్కు వెళ్లి 18న వద్దాం అంటే, నిఖిల్ ఎక్కడికిపోతావు చిన్నవాడా కూడా 11, 18 డేట్ లను పరిశీలిస్తోంది. అలాగే మరి ఒకటి, రెండు సినిమాలు కూడా అదే రోజు విడుదలను ఆలోచిస్తున్నాయి.

సో, మొత్తం మీద 11, 18 డేట్లు క్రేజీగా మారాయి.