118 ప్రీ రిలీజ్ బిజినెస్

కళ్యాణ్ రామ్, షాలినీ పాండే, నివేధా ధామస్ లతో కలసి, సినిమాటోగ్రాఫర్ గుహాన్ డైరక్షన్లో మహేష్ కోనేరు నిర్మించిన సినిమా 118. ఈ సినిమా టేబుల్ ప్రాఫిట్ తో విడుదల అవుతుండడం విశేషం. అన్నీకలిపి…

కళ్యాణ్ రామ్, షాలినీ పాండే, నివేధా ధామస్ లతో కలసి, సినిమాటోగ్రాఫర్ గుహాన్ డైరక్షన్లో మహేష్ కోనేరు నిర్మించిన సినిమా 118. ఈ సినిమా టేబుల్ ప్రాఫిట్ తో విడుదల అవుతుండడం విశేషం. అన్నీకలిపి 11 కోట్ల బడ్జెట్ తో తయారైన ఈ సినిమాకు దాదాపు 14 కోట్ల బిజినెస్ జరిగింది.

సినిమా హిందీ డబ్బింగ్ ను నాలుగుకోట్లకు విక్రయించారు. ఆంధ్ర, నైజాం కలిపి దిల్ రాజు అయిదు కోట్లకు ఎన్ఆర్ఐ చేసారు. సీడెడ్ ను కోటి రూపాయలకు విక్రయించారు. శాటిలైట్ ను జెమిని టీవీకి 3.10 కోట్లకు డీల్ చేసారు. ఇదికాక కర్ణాటక, బోర్డర్ ఏరియాలు కొంచెం వచ్చింది. ఆ విధంగా మొత్తంమీద 14కోట్ల వరకు బిజినెస్ చేసారు.

ఓవర్ సీస్ ను స్వంతంగా విడుదల చేస్తున్నారు. ఈ సినిమా మీద కళ్యాణ్ రామ్ చాలా ధీమాతో వున్నారు. ఎన్టీఆర్ సినిమాను చూసి, 2 గంటల ఏడు నిమిషాల సినిమాలో ఒక్క నిమిషం కూడా కట్ చేయాల్సిన పని లేదని, చాలా బాగుందని, నివేదాకు ఈ సినిమాతో మాంచి పేరు వస్తుందని చెప్పారట. ఈ విషయాన్ని కళ్యాణ్ రామ్ నే చెబుతున్నారు.

నివేదా కూడా ఈసినిమాతో మరో హిట్ అందుకుంటా అనే అన్ని ఇంటర్వూల్లో చెబుతోంది. ఈ సినిమా మార్చి 1న విడుదల కాబోతోంది.

పవన్‌ తీరే కారణమా? అందుకే నేతలు పట్టించుకోవడం లేదు!

బాలకృష్ణ ఓవరాక్షన్ ను భరించలేం