మహేష్ బాబు మేజర్ అనౌన్స్ మెంట్ వచ్చేసింది. అయితే ఇది మహేష్ బాబు నటిస్తున్న సినిమా కాదు. మహేష్ బాబు నిర్మిస్తున్న సినిమా. మహేష్ బాబు తన స్వంత బ్యానర్ ను సోని సంస్థతో కలిసి, ఇంకా ఎ ప్లస్ ఎస్ అనే సంస్థను తోడు తీసుకుని నిర్మిస్తున్న సినిమా ఇది.
అడవి శేష్ హీరో. ఎ ప్లస్ ఎస్ అంటే అనురాగ్… శరత్. చాయ్ బిస్కట్ అనే సంస్థ యజమానులు వీళ్లు. ఇన్నాళ్లు హీరోల డిజిటల్ మార్కెటింగ్ ను తెరవెనుక చూసిన వీళ్లు, ఇప్పుడు నిర్మాణ రంగంలోకి అడుగుపెడుతున్నారు.
అడవి శేష్, అనురాగ్, శరత్, మహేష్ బాబు, సోనీ సంస్థ, గూఢచారి సినిమా డైరకర్ట్ శశికిరణ్ కలిపి చేస్తున్న ప్రాజెక్టు ఇది. మేజర్ ఉన్నికృష్ణన్ లైఫ్ స్టోరీలోని సంఘటన (26/11 సంఘటన) ఆధారంగా తయారుచేస్తారు ఈ సినిమా.
తెలుగు హిందీ భాషల్లో తయారయ్యే ఈ సినిమా ఈ సమ్మర్ లో షూటింగ్ ప్రారంభించుకుని, 2020లో విడుదల అవుతుంది.