సమంత-నాగ చైతన్య పెళ్లయిపోయింది, చెన్నయ్ లో పార్టీలు అయిపోయాయి. ఆఖరికి వారి హానీమూన్ కూడా యూరప్ లో అయిపోతోంది. మరి ఇంతకీ టాలీవుడ్ జనాలకు రిసెప్షన్ ఎప్పుడు? అదే పనిలో అక్కినేని ఇంటి పెద్ద నాగార్జున ఫుల్ బిజీగా వున్నారు. నవంబర్ 12న ఆయన తన ఎన్ కన్వెన్షన్ సెంటర్ లో శామ్-చైతూల పెళ్లి రిసెప్షన్ పనుల్లో ఫుల్ బిజీగా వున్నారు.
పెళ్లికి టాలీవుడ్ ఏ టు జెడ్ అందరినీ ఆహ్వానిస్తారు. అలాగే సిటీలోని బిజినెస్, పొలిటికల్, సెలబ్రిటీ సర్కిల్ అందరికీ పిలుపులు వెళ్తాయట. ఈ జాబితాలు తయారు చేయించే పని ఓ పక్క, రిసెప్షన్ ఏ విధంగా వుండాలి అనే పని మరోపక్క, ఇలా నాగ్ మార్నింగ్ టు ఈవెనింగ్ ఫుల్ బిజీగా వున్నారు.
ఆర్జీవీ సినిమా ఎప్పుడు?
నాగ్ ఈ పెళ్లి రిసెప్షన్ పనులతో పాటే ఆర్జీవీ తో చాలా కాలం తరువాత సినిమా చేసే ఆలోచన కారణంగా, జరుగుతున్న డిస్కషన్లలో కూడా పాల్గొంటున్నట్లు తెలుస్తోంది. అయితే ఈ సినిమా ఇఫ్పట్లో స్టార్ట్ అవుతుందా అన్నది అనుమానం.
ముహుర్తం కోసం పూజ అయితే చేస్తారేమో కానీ, అఖిల్ తో నిర్మిస్తున్న హలో సినిమా విడుదలయ్యే దాకా నాగ్ మరో పని పెట్టుకోవకపోచవ్చు. ఈ సినిమా విషయంలో నాగ్ చాలా కేరింగ్ గా వున్నారు. అందువల్ల దాని నుంచి డైవర్ట్ అయ్యే పని ఏదీ పెట్టుకోరు. అందువల్ల డిసెంబర్ తరువాతే వర్మ సినిమా ఫుల్ ఫామ్ లోకి వస్తుందని అనుకోవాలి.