చైతూ సినిమాకు ముహూర్తం ఫిక్స్

లెక్కప్రకారం నాగచైతన్య ఈపాటికి సెట్స్ పైకి రావాలి. కానీ పెళ్లి తర్వాత స్వల్ప విరామం తీసుకున్నాడు. అలా ఆలస్యమైన సవ్యసాచి ప్రాజెక్టు ఎట్టకేలకు సెట్స్ పైకి రానుంది. నాగచైతన్య హీరోగా చందు మొండేటి దర్శకత్వంలో…

లెక్కప్రకారం నాగచైతన్య ఈపాటికి సెట్స్ పైకి రావాలి. కానీ పెళ్లి తర్వాత స్వల్ప విరామం తీసుకున్నాడు. అలా ఆలస్యమైన సవ్యసాచి ప్రాజెక్టు ఎట్టకేలకు సెట్స్ పైకి రానుంది. నాగచైతన్య హీరోగా చందు మొండేటి దర్శకత్వంలో ఈనెల 8నుంచి సవ్యసాచి రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం అవుతుంది.

ఈ సినిమాలో హీరోయిన్ గా నిధి అగర్వాల్ ను ఎంపికచేశారు. మ్యూజిక్ డైరక్టర్ గా కీరవాణిని తీసుకున్నారు. నిధి అగర్వాల్ కు ఇదే తొలి తెలుగు సినిమా కాగా.. బాహుబలి-2 తర్వాత కీరవాణి చేస్తున్న ప్రాజెక్టు ఇదే కావడం విశేషం. మూవీకి సంబంధించి ఇప్పటికే కొన్ని ట్యూన్స్ లాక్ చేశారు. ఈ మ్యూజిక్ సిట్టింగ్స్ లో నాగచైతన్య కూడా పాల్గొన్నాడు.

సవ్యసాచి ఫస్ట్ లుక్ ఇప్పటికే రిలీజ్ చేశారు. ఈ సినిమా స్టోరీని కూడా నాగచైతన్య రివీల్ చేశాడు. హీరో ఎడమ చేయి అతడి మాట వినదు. కుడిచేయికి ఎంత పవర్ ఉంటుందో ఎడమ చేయికి కూడా అంతే శక్తి ఉంటుంది. హీరోతో ప్రమేయం లేకుండా ఎడమ చేయి ఏం చేస్తుంది, హీరోకు ఎలాంటి సమస్యలు తెచ్చిపెడుతుందనేదే స్టోరీ.