రెండేళ్ల విరామం తర్వాత వచ్చిన 'రాజా ది గ్రేట్' సినిమాకు మంచి రెస్పాన్స్ రావడంతో రవితేజ మైండ్ సెట్ మారిపోయింది. వినోదం పండిస్తే వర్కవుట్ అవుతుందని మరోసారి తెలుసుకున్న ఈ హీరో.. అప్ కమింగ్ మూవీస్ విషయంలో మరో కీలక నిర్ణయం తీసుకున్నాడు. ఓ రీమేక్ ను పక్కనపెట్టి శ్రీనువైట్లతో సెట్స్ పైకి వెళ్లడానికి నిర్ణయించాడు.
ప్రస్తుతం రవితేజ చేతిలో 2సినిమాలున్నాయి. తమిళ్ లో హిట్ అయిన బోగన్ రీమేక్ తో పాటు శ్రీనువైట్ల దర్శకత్వంలో మరో సినిమా ఉంది. వీటిలో బోగన్ ముందు సెట్స్ పైకి వస్తుందనుకున్నారు. కానీ రవితేజ ఆ సినిమాను పక్కనపెట్టాడట. కంప్లీట్ ఎంటర్ టైన్ మెంట్ తో కూడిన శ్రీనువైట్ల సినిమాకు ఓకే చెప్పాడట.
గతంలో వెంకీ, దుబాయ్ శ్రీను లాంటి సినిమాలొచ్చాయి వీళ్లిద్దరి కాంబినేషన్ లో. ఇప్పుడు కూడా అలాంటిదే ఓ హిలేరియస్ స్క్రిప్ట్ రాసుకున్నాడట వైట్ల. వినోదం పుష్కలంగా ఉండడంతో రవితేజ ఓకే చెప్పినట్టు తెలుస్తోంది. సో.. మొదట సెట్స్ పైకి వచ్చేది ఇదే అని తెలుస్తోంది.
అయితే ఈ ప్రాజెక్టు కంటే ముందు 'టచ్ చేసి చూడు' సినిమాను పూర్తిచేయాల్సి ఉంది. దీన్ని టచ్ చేయడానికి రవితేజ ఏమాత్రం ఇంట్రెస్ట్ చూపించడం లేదని తెలుస్తోంది. రాజా ది గ్రేట్ లాంటి ఎంటర్ టైనింగ్ మూవీ తర్వాత టచ్ చేసి చూడు లాంటి సీరియస్ సబ్జెక్ట్ వస్తే రిజల్ట్ తేడా కొడుతుందేమోనని రవితేజ భయం.