(హౌస్టన్, అక్టోబర్ 30, 2017) అమెరికా తెలంగాణ అసోసియేషన్ ('ఆ టా') ప్రొఫెసర్ సాంబరెడ్డిని ప్రత్యేకంగా ఆదరించి, తెలంగాణ సాంప్రదాయాలతో ఘనంగా సత్కర్నచింది. అమెరికాలో హౌస్టన్ మహానగరంలో జూన్ 2018లో జరగనున్న ద్వితీయ తెలంగాణ ప్రపంచ మహా సభలకు సన్నాహాలు చేస్తు జరిగిన తొలి ఆటా విరాళాల సేకరణ సభలో, టెక్సాస్ ఏ&ఎమ్ విశ్వవిధ్యాలయం ప్రొఫెసర్ డా. సాంబరెడ్డిని 'ఆటా' బృందం అతి ఆత్మీయత గా సత్కరించింది.
ఆటా కన్వెన్షన్ బృందం నేతృత్వములో కనులవిందుగా జరిగిన, కిక్కిరిసిన ప్రారంబ సభలో చీఫ్ గెస్ట్ గా విచ్చేసిన గౌరవ తెలంగాణ పార్లమెంట్ లీడర్ MP జితేందర్ రెడ్డి గారు ఈ సత్కారాన్ని అందజేశారు. ప్రముఖ డాక్టర్ ఆటా అడ్వైసర్ డా. ప్రభాకర్ గునిగంటి పుష్పగుచ్ఛముతో సాంబ రెడ్డిని అభినందించారు.
డా. సాంబరెడ్డి ఒక సైంటిస్ట్ తో పాటు ఒక గొప్ప సామాజిక స్పృహ కల్గిన సాహస తెలుగ యువ నాయకుడని ఆటా కన్వీనర్ బంగారెడ్డి ఆలూరి కొనియాడారు. మెడికల్ రీసెర్చ్ ఒక కఠినమైన పని అని అందులో మెదడుకు సంబంధిత రోగాలకు నూతన చికిత్స కనిపెట్టడం లాంటి అసాధ్యమైన కార్యక్రమంలో విజయం సాధించారని ప్రొఫెసర్ రాజేందర్ అప్పరాసు విస్తరిస్తు డా. సాంబరెడ్డిని సభకు పరిచయం చేశారు.
ఫార్మసీ మెడికల్ రంగాల్లో అత్యంత ప్రతిభతో మెదడు జబ్బుల మందులను కనిపెట్టిన తెలుగుతేజం, హిందూ-రతన్ గ్రహీత డా. దూదిపాల సాంబరెడ్డిని గౌరవించడం మాకు చాలా సంతోషంగ ఉందని ప్రకటించారు. ఇటీవలే నరాల జబ్బు 'న్యూరో – కోడ్' కనిపెట్టి ప్రపంచ మన్ననలందుకున్నారు. గత ఇరవై సంవత్సరాలలో 150శాస్త్ర సాహితీ పేపర్స్ ప్రచురించి ఫార్మకాలజీలో ప్రపంచ ప్రసిద్ధి కెక్కారు.
హౌస్టన్ వ్యాపారవేత్త ఆటా డైరెక్టర్ శ్రీధర్ కాంచనకుంట్ల, ఆటా ప్రెసిడెంట్ సత్యనారాయణరెడ్డి కందిమల్ల, ఆటా ప్రెసిడెంట్-ఎలెక్ట్ వినోద్ కుకునూర్, అట పూర్వ అధ్యక్షులు కరుణాకర్ మాధవారపు, రాంమోహన్ కొండా, ఆటా బోర్డు మెంబర్లు, కన్వెన్షన్ సభ్యలు, కన్వెన్షన్ కమిటి చైర్మన్లు మరియు తదితరులు హాజరయ్యారు.
తెలంగాణ అసోసియేషన్ అఫ్ గ్రేటర్ హౌస్టన్ (టాగ్) ప్రెసిడెంట్ జగపతి రెడ్డి వీరటి, సభ్యలు దయాకర్, వీరేందర్, విజయ్, లక్ష్మి మేడి తదిరలు పాల్గొన్నారు.
డా. సాంబ రెడ్డి మాట్లాడుతూ ఇంత ఆత్మీయ సన్మానం అందుకోవడం నా అదృష్టంగా భావిస్తున్నాను. నేను మేలో ఒకడిని, ఇంతటి శుభ సందర్బాంగా ప్రత్యేకం గా అభిమానించి 'తెలంగాణ సత్కారం' తో గౌరవించి నందుకు చాలా సంతోషంగా వుంది. ఒక తెలంగాణ ముద్దు బిడ్డగా, ఇంక ఎన్నో విజయాలు సాధించి తెలంగాణ గడ్డ కి మన తెలుగు వారెందరి కీర్తి ప్రతిష్టలు పెంపొందించాలని ఆశిర్వదించండని కృతజ్ఞత భావంతో పేర్కొన్నారు.
వైద్య శాస్త్ర పురోగతి పెంపొందిస్తు భారత దేశ ఖ్యాతిని విశ్వ వ్యాప్తంగా విస్తరిస్తున్నందుకు గాను డా. సాంబరెడ్డిని భారత ప్రభుత్వ 'పద్మశ్రీ' పురస్కారానికి నామినేట్ ఐన విషయం తెలిసిందే.
వరంగల్ జిల్లా పరకాల పరిధిలో ఒక కుగ్రామం చెర్లపల్లిలో జన్మించి, స్వయం శక్తితో కాకతీయ విశ్వవిద్యాలయంలో ఫార్మసీ పట్ట భద్రులయిన డా. సాంబరెడ్డి ప్రస్తుతం అమెరికాలోని టెక్సాస్ ఏ&ఎమ్ విశ్వవిధ్యాలయం వైధ్య శాస్త్ర ప్రొఫెసర్ గా సేవలందిస్తున్నారు.