రెండుసార్లు వరుసగా సంక్రాంతికి తమ బ్యానర్ సినిమాలు తీసుకువచ్చి, విజయాలు సాధించింది యూవీ క్రియేషన్స్. ఈసారి సంక్రాంతికి మీడియం సినిమా ఏదీలేదు. కానీ ఎప్పటి నుంచో చెక్కుతున్న భాగమతి సినిమా మాత్రం వుంది. అయితే ఈ సినిమాను డిసెంబర్ మూడో వారంలో విడుదల చేద్దాం అనుకున్నారు. కానీ హీరో నాగ్ తన కొడుకు అఖిల్ సినిమాకు పోటీ ఏదీ వుండకుండా చూసుకుంటునాడు. ఆ దశలో యూవీ కూడా కాస్త మొహమాటం తప్పడంలేదు.
ఇదిలా వుంటే భాగమతి సినిమా తెలుగు తమిళ భాషల్లో నిర్మించారు. తమిళ, తెలుగు జనాలకు సంక్రాంతి కీలకం. అందుకే ఆ టైమ్ లో భాగమతిని విడుదల చేస్తే ఎలా వుంటుంది అన్న ఆలోచన కొత్తగా చేస్తున్నట్లు తెలుస్తోంది. అయితే సంక్రాంతి వెళ్లిన పది రోజులకు రోబో వస్తోంది. సంక్రాంతికి కూడా సూర్య సినిమా ఒకటి వుంటుందంటున్నారు. ఇవన్నీ చూసుకుని, భాగమతిని కూడా ఏమాత్రం వీలున్నా సంక్రాంతికి తేవాలని యూవీ సంస్థ భావిస్తున్నట్లు తెలుస్తోంది.
సెంటిమెంట్ వర్కవుట్ అవ్వడం సంగతి అలా వుంచితే, గతంలో సంక్రాంతికి యూవీ నుంచి వచ్చిన రెండు సినిమాలు పదికోట్లు బడ్జెట్ సినిమాలు. కానీ భాగమతి అలా కాదు, 35నుంచి 40కోట్ల రేంజ్ సినిమా.