సరిగ్గా 28 ఏళ్ల కిందట వచ్చిన శివ సినిమాకు అన్నపూర్ణ స్టుడియోలోని ఏ స్పాట్ లో క్లాప్ కొట్టారో.. సరిగ్గా అదే ప్లేస్, అదే స్పాట్ లో నాగ్-వర్మ కాంబినేషన్ లో రాబోతున్న మూవీకి క్లాప్ కొట్టబోతున్నారు. ఈ మేరకు డేట్ కూడా ఫిక్స్ అయింది. రామ్ గోపాల్ వర్మ దర్శకత్వంలో నాగ్ నటించనున్న కొత్త సినిమా నవంబర్ 20న ప్రారంభంకానుంది. ఆ రోజే ముహూర్తం షాట్.. ఆ రోజే రెగ్యులర్ షూట్ కూడా.
ఈ సినిమాకు నాగార్జున నిర్మాత కాదు. స్వయంగా తన స్వీయ దర్శకత్వంలో స్వయంగా ఆర్జీవీ నిర్మించబోతున్నాడు. వర్మ చిరకాల మిత్రుడు సుధీర్ ఈ సినిమాకు ప్రజెంటర్ గా వ్యవహరిస్తాడు. డిఫరెంట్ కాన్సెప్ట్ తో వస్తున్న ఈ సినిమాలో ఎన్ కౌంటర్ స్పెషలిస్ట్ గా కనిపిస్తాడట నాగార్జున.
ఇంకా పేరుపెట్టని ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ టైమ్ కు అఖిల్ తో నిర్మిస్తున్న హలో సినిమాను దాదాపు పూర్తిచేయయబోతున్నాడు నాగ్. అఖిల్ సినిమా రిలీజ్ అయ్యేంత వరకు వర్మ సినిమా షూటింగ్ స్లోగా నడుస్తుంది.
అఖిల్ మూవీ థియేటర్లలోకి వచ్చిన వెంటనే ఈ సినిమా ఊపందుకుంటుంది. వచ్చే ఏడాది ఏప్రిల్ నాటికి షూటింగ్ పూర్తిచేయాలని టార్గెట్ గా పెట్టుకున్నారు. నిజానికి వర్మకు అంత టైం అక్కర్లేదు.