2019-మీడియం సినిమాలదే రాజ్యం

2019లో భారీ సినిమాలు మరీ ఎక్కవ లేవు. ఎన్టీఆర్ బయోపిక్, రామ్ చరణ్-బోయపాటి, వెంకీ ఎఫ్ 2 ఈ మూడూ జనవరిలో విడుదలైపోతాయి. సమ్మర్ కు  సైరా, మహర్షి, సాహో సినిమాలు మాత్రమే ప్లానింగ్…

2019లో భారీ సినిమాలు మరీ ఎక్కవ లేవు. ఎన్టీఆర్ బయోపిక్, రామ్ చరణ్-బోయపాటి, వెంకీ ఎఫ్ 2 ఈ మూడూ జనవరిలో విడుదలైపోతాయి. సమ్మర్ కు  సైరా, మహర్షి, సాహో సినిమాలు మాత్రమే ప్లానింగ్ లో వున్నాయి. ఇవికాక బన్నీ-త్రివిక్రమ్ సినిమా వుంటుంది. అది దసరాకే ప్లాన్ చేస్తారేమో?

ఎన్టీఆర్ సినిమా 2019లో మరి వుండదు. వుంటేగింటే, బాలయ్య-బోయపాటి సినిమా వస్తుంది. అంటే పెద్ద సినిమాలు మహా అయితే ఆరు లేదా ఏడు మాత్రమే. 150 సినిమాల వరకు విడుదలయ్యే టాలీవుడ్ లో డజనుకు పైగానే ఎప్పుడూ పెద్ద సినిమాలు వుంటాయి. కానీ 2019లో ఆ పరస్థితి కనిపించడం లేదు.

మిగిలిన నెలలు అంటే ఫిబ్రవరి నుంచి ఏప్రియల్, జూన్ నుంచి డిసెంబర్ వరకు దాదాపు చిన్న, మీడియం సినిమాలే వుండే పరిస్థితి కనిపిస్తోంది. అందుకే మీడియం సినిమాల జోరు అందుకుంటోంది. ఇప్పటి నుంచి ప్లానింగ్ మొదలయిపోయింది.

విజయ్ దేవరకొండ రెండు సినిమాలు, నాని ఒక సినిమా, షురూ అయిపోతున్నాయి. నిఖిల్ శ్వాస ప్రారంభం కాబోతోంది. శర్వానంద్ రెండు సినిమాలు రెడీ అవుతున్నాయి. అఖిల్ సినిమా ఫిబ్రవరిలో వుండడానికే ఎక్కువ అవకాశం వుంది. చైతన్య-సమంతల సినిమా కూడా వచ్చే ఏడాదిలోనే. ఇవికాక డిస్కషన్లలో నాని సినిమా ఒకటి వుంది.

సాయిధరమ్ సినిమా ఇప్పుడే మొదలయింది. అది కూడా 2019కే. రవితేజ-సంతోష్ శ్రీనివాస్ సినిమా ఓపెనింగ్ ప్లాన్ లో వుంది. అదే ఏడాదిలో కొత్త హీరోలుగా సాయిధరమ్ సోదరుడి సినిమా, డివివి దానయ్య కొడకు సినిమా వుండే అవకాశం వంది.

అలాగే గల్లా జయదేవ్ కొడుకు, మహేష్ మేనల్లుడు అశోక్ సినిమా కూడా అప్పుడే. దానా దీనా మొత్తంమీద 2019లో మీడియం సినిమాలదే రాజ్యంలా కనిపిస్తోంది.

గ్రేట్ ఆంధ్ర వీక్లీ పేపర్ కోసం క్లిక్ చేయండి