శర్వానంద్-సుధీర్ వర్మ కాంబినేషన్ లో సితార ఎంటర్ టైన్ మెంట్స్ నిర్మించిన సినిమా రణరంగం. ఈ సినిమా వచ్చేనెల 15న విడుదలకు రెడీ అవుతోంది. ఈ నేపథ్యంలో రణరంగం సినిమా ప్రీరిలీజ్ ఈవెంట్ ఒకటి కాకినాడలో చేయడానికి రంగం సిద్దం అవుతోంది.
రణరంగం సినిమాలో కీలక ఎపిసోడ్ లు అన్నీ కాకినాడ పోర్టులో షూట్ చేయడం ఇందుకు ఒక కారణం. అదే విధంగా ఈ నెలాఖరు నుంచి రెండు వారాల పాటు సితార ఎంటర్ టైన్ మెంట్స్ పేరెంటల్ కంపీనీ హారిక హాసిని యూనిట్ కాకినాడలోనే వుంటుంది. బన్నీ-త్రివిక్రమ్ సినిమా షూట్ అక్కడ రెండువారాల పాటు వుంటుంది.
అందుకే అన్ని విధాలా బాగుంటుందని రణరంగం ప్రీ రిలీజ్ ఈవెంట్ ఒకటి కాకినాడలో ప్లాన్ చేస్తున్నారు. దీనికి అదనంగా హైదరాబాద్ లో మరో ఈవెంట్ కూడా ప్లాన్ చేస్తున్నారు. ఆ మధ్య ప్రమాదం జరిగిన తరువాత శర్వానంద్ కోలుకుని షూటింగ్ కు వెళ్తున్నారు. కానీ జనం ముందుకురావడం మాత్రం ఈ ప్రీరిలీజ్ ఈవెంట్ తోనే.
రణరంగం సినిమాలో శర్వా రెండు షేడ్స్ లో కనిపిస్తాడు. ఈ రెండు షేడ్స్ కు ఇద్దరు హీరోయిన్లు గా కాజల్, కళ్యాణి ప్రియదర్శన్ నటించారు.