ఇలాగైతే బీజేపీకి ఏపీలో ముందడుగు పడేది ఎలా.?

టీడీపీ నలుగురు రాజ్యసభ సభ్యులొచ్చారు.. ఓ ఎమ్మెల్సీ కూడా పదవికి రాజీనామా చేసి టీడీపీ నుంచి బీజేపీలో చేరారు.. ఇంకొందరు టీడీపీ ముఖ్యనేతలూ బీజేపీ వైపు చూస్తున్నారు. అంతా బాగానే వుందిగానీ.. వచ్చిన వారిలో…

టీడీపీ నలుగురు రాజ్యసభ సభ్యులొచ్చారు.. ఓ ఎమ్మెల్సీ కూడా పదవికి రాజీనామా చేసి టీడీపీ నుంచి బీజేపీలో చేరారు.. ఇంకొందరు టీడీపీ ముఖ్యనేతలూ బీజేపీ వైపు చూస్తున్నారు. అంతా బాగానే వుందిగానీ.. వచ్చిన వారిలో ఒక్కరన్నా, గ్రామ స్థాయిలో పార్టీని బలోపేతం చేయగలిగేవారున్నారా.? అంటే, బీజేపీ నేతల దగ్గరే సమాధానం లేని పరిస్థితి.

'వచ్చినోళ్ళంతా తమ తమ రాజకీయ అవసరాల కోసమే తప్ప, ఎవరూ పార్టీ గురించి ఆలోచించడంలేదు.. పార్టీ కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొనడంలేదు. ఒకవేళ పాల్గొన్నా, వారివల్ల పార్టీకి ఏమాత్రం ఉపయోగం వుండడంలేదు..' అంటూ ఏపీకి చెందిన బీజేపీ నేతలు వాపోతున్నారు. 'ఆంధ్రప్రదేశ్‌లో టీడీపీ కథ ముగిసింది..' అని గట్టిగా చెప్పగలుగుతున్న ఏపీ బీజేపీ నేతలు, ఈ రెండేళ్ళలో కాస్తంతైనా టీడీపీ బలపడిందని గుండె మీద చెయ్యేసుకుని చెప్పలేని పరిస్థితి.

ఈ నేపథ్యంలోనే, తమ అసహనాన్ని బీజేపీ నేతలు, వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ మీద చూపిస్తున్నారు. ఒకరి తర్వాత ఒకరు.. బీజేపీ ముఖ్య నేతలంతా కూడబలుక్కుని వైసీపీ పాలన మీద విమర్శల తీవ్రత పెంచేశారు. రెండునెలలు దాటుతున్నా, వైఎస్‌ జగన్‌ ప్రభుత్వం పరిపాలనలో తనదైన ముద్ర వేయలేకపోయిందన్నది వారి విమర్శ. నిజానికి, ఈ విమర్శలో అసహనమే ఎక్కువగా కన్పిస్తోంది.

చంద్రబాబు పాలనలో జరిగిన అవినీతిని వెలికి తీయాలని డిమాండ్‌ చేసిన బీజేపీ నేతలే, ఇప్పుడు రూటు మార్చారు. పోలవరం ప్రాజెక్టుకి సంబంధించి టెండర్ల ప్రక్రియలో అవినీతి జరిగిందని వైఎస్‌ జగన్‌ ప్రభుత్వం నిజాలు నిగ్గుతేల్చితే, ఆ విషయమై స్పందించేందుకు ఏపీ బీజేపీ నేతలు ఒకింత మొహమాటపడుతున్నారు. 'మేం ఎప్పుడో చెప్పాం..' అంటున్నారే తప్ప, ఆ సమయంలో.. ఆ పాలనలో తమకూ భాగం వుందని మాత్రం ఒప్పుకునే సాహసం చేయడంలేదు. ఇసుక కుంభకోణం విషయంలోనూ అంతే.

సుజనా చౌదరి, సీఎం రమేష్‌.. ఈ ఇద్దరూ చంద్రబాబు హయాంలో భారీగా దండుకున్నారన్నది ఒకప్పుడు బీజేపీ చేసిన ఆరోపణ. ఆ ఇద్దరూ ఇప్పుడు బీజేపీలోనే వున్నారు. ప్రధానంగా సాగునీటి ప్రాజెక్టుల్లో అవినీతిపై సీఎం రమేష్‌పైనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. అక్కడే వైసీపీ జోరు బీజేపీకి నచ్చడంలేదు. మొత్తమ్మీద, బీజేపీ పరిస్థితి పెనం మీద నుంచి పొయ్యిలో పడ్డట్టయ్యిందన్నమాట.

'వాళ్ళని తీసుకోవడం వల్ల ఆ మకిలి మనకీ అంటుకుంది' అంటూ ఏపీ బీజేపీ నేతల్లో కొందరు వాపోతున్నారంటే, వారి ఆవేదనలోనూ అర్థం వుంది మరి. ఇలా పూర్తి కన్‌ఫ్యూజన్‌లో పడిపోయిన బీజేపీ, జీరో నుంచి.. ఏపీలో బలమైన రాజకీయ శక్తిగా ఎదగడం సాధ్యమేనా.? ఛాన్సే లేదు.

డియర్ కామ్రేడ్ పై దర్శకుడి కష్టాలు

ఈవారం గ్రేట్ ఆంధ్ర స్పెషల్ వీక్లీ పేపర్ కోసం క్లిక్ చేయండి