క్రేజ్ తగ్గింది.. ఎలిమినేషన్ కష్టమైంది

బిగ్ బాస్ సీజన్-3కి క్రేజ్ తగ్గిందా?  అవుననే అంటున్నారు చాలామంది. ఈ రియాలిటీ షోకు క్రేజ్ తగ్గిందో లేదో చెప్పడానికి 10 రోజుల తర్వాతొచ్చే రేటింగ్స్ వరకు ఆగనక్కర్లేదు. ఈ షోకు సంబంధించి వచ్చే…

బిగ్ బాస్ సీజన్-3కి క్రేజ్ తగ్గిందా?  అవుననే అంటున్నారు చాలామంది. ఈ రియాలిటీ షోకు క్రేజ్ తగ్గిందో లేదో చెప్పడానికి 10 రోజుల తర్వాతొచ్చే రేటింగ్స్ వరకు ఆగనక్కర్లేదు. ఈ షోకు సంబంధించి వచ్చే ఓట్లు చూస్తేనే అర్థమౌతుంది క్రేజ్ తగ్గిందని. అవును.. బిగ్ బాస్ సీజన్-3కు పోలింగ్ పర్సంటేజ్ చాలా తక్కువగా వచ్చినట్టు తెలుస్తోంది. చూస్తుంటే బుల్లితెర వీక్షకులు ఈ సీజన్ ను లైట్ తీసుకున్నట్టు కనిపిస్తోంది.

గతంలో ఎన్నడూ లేని విధంగా బిగ్ బాస్ సీజన్ 3కు అతి తక్కువ ఓట్లు వచ్చినట్టు తెలుస్తోంది. ఇంత తక్కువ ఓట్లతో ఎలిమినేషన్ ప్రక్రియ చేపడితే విమర్శలు ఎదుర్కోవాల్సి వస్తుందని యూనిట్ భావిస్తోంది. మరీ ముఖ్యంగా ఈ విషయంలో నాగార్జున విముఖత చూపినట్టు తెలుస్తోంది. వచ్చిన 2-3 వేల ఓట్లతో ఎలిమినేషన్ చేపట్టడం మంచిదికాదని సూచించాడు.

నిజానికి ఓట్ల సంఖ్యను బిగ్ బాస్ లో చెప్పరు. కేవలం పోలింగ్ పర్సంటేజీని మాత్రమే సూచిస్తారు. అయినప్పటికీ అలా చేయడం మంచిదికాదని నాగ్ వారించినట్టు తెలుస్తోంది. ఈరోజు రాత్రికి ప్రసారమయ్యే ఎపిసోడ్ లో హౌజ్ నుంచి ముందుగా ఎలిమినేట్ అయ్యేది ఎవరనేది తేలిపోతుంది. ఓట్లు తక్కువగా వచ్చిన కారణంగా ఈ వారానికి ఎలిమినేషన్ ప్రక్రియను నిలిపివేసే అవకాశం కూడా ఉన్నట్టు తెలుస్తోంది.

ఎలిమినేషన్ రౌండ్ లో భాగంగా ఆరుగుర్ని ఫైనల్ చేశారు. జాఫర్, హేమ, పునర్నవి, వితిక, రాహుల్, హిమజలో ఒకరు బిగ్ బాస్ హౌజ్ నుంచి బయటకు వెళ్లడం గ్యారెంటీ. అయితే వీళ్లలో హిమజ సేవ్ అయినట్టు రాత్రి జరిగిన షోలోనే నాగార్జున క్లారిటీ ఇచ్చాడు.

సో.. ఇక మిగిలింది ఐదుగురు. వీళ్ల ఐదుగురిలో ఎవరు హౌజ్ నుంచి బయటకు వెళ్లిపోతారనే విషయం ఈరాత్రికి తేలిపోతుంది. అసలు ఎలిమినేషన్ చేస్తారా లేక ఈ వారానికి ఆ ప్రక్రియను ఆపేస్తారా అనే విషయం కూడా ఈ రాత్రికి తేలిపోతుంది.

డియర్ కామ్రేడ్ పై దర్శకుడి కష్టాలు

ఈవారం గ్రేట్ ఆంధ్ర స్పెషల్ వీక్లీ పేపర్ కోసం క్లిక్ చేయండి