గీత గోవిందం సినిమాతో పాటే లీక్ అయిన సినిమాలు చాలా వున్నాయని అప్పట్లో వార్తలు వినిపించాయి. అయితే లీక్ అయినవి అన్నీ రఫ్ కట్ లు, డిలీటెడ్ వెర్షన్లు అనికూడా వెల్లడయింది. దీని మీద కేసులు వున్నాయి. విచారణలు జరుగుతున్నాయి. అయితే ఇండస్ట్రీలో ఆందోళన కరంగా వినిపిస్తున్న గుసగుస ఏమిటంటే, ఇలా లీక్ అయిన ఫుటేజ్ ల్లో విజయ్ దేవరకొండ తరువాత సినిమా టాక్సీవాలా కూడా వుందని. కేవలం వుండడం కాదు, సుమారు 45 నిమిషాల సినిమా లీకుల బారినపడిందని గుసగసులు వినిపిస్తున్నాయి.
అయితే అదృష్టం ఏమిటంటే, ఎప్పుడైతే పోలీసులు రంగ ప్రవేశం చేసి, కొందరిని అదుపులోకి తీసుకున్నారో, ఇక అప్పటి నుంచి ఎక్కడి ఫోన్లలో ఫుటేజ్ లు అక్కడే ఆగిపోయాయి. ఫార్వార్డ్ కొట్టడానికే జంకుతున్నారని వినికిడి. కానీ ఫోన్ లలోనే చూసుకునే వ్యవహారం మాత్రం ఆగలేదని తెలుస్తోంది.
భీమవరం ప్రాంతంలో కొంతమంది దగ్గర ఈ ఫుటేజ్ వుందని గుసగుసలు వినిపిస్తున్నాయి. ఎవరి దగ్గర అన్నది తెలియదు కానీ, 45 నిమిషాల టాక్సీవాలా సినిమా బయట వుందని మాత్రం వినిపిస్తోంది. టాక్సీవాలా నిర్మాతలు కాస్త గట్టి చర్యలు తీసుకుని, పోలీసుల సాయంతో కంట్రోలు చేసుకోవడం… లేదూ అంటే చలామణీలోకి వస్తే సినిమాకు డ్యామేజ్ జరిగే అవకాశం వుంది.