Advertisement

Advertisement


Home > Movies - Movie Gossip

వ్యభిచారం దందాలో ఆ ఐదు మంది హీరోయిన్లు!

వ్యభిచారం దందాలో ఆ ఐదు మంది హీరోయిన్లు!

అమెరికాలో బయటపడ్డ టాలీవుడ్ సంబంధ వ్యభిచార దందాలో ఐదు మంది హీరోయిన్ల ఇన్‌వాల్వ్‌మెంట్ ఉందని అభియోగాలు దాఖలైనట్టుగా తెలుస్తోంది. వీళ్లు బాధితులా? యాక్టివ్ రోల్ పోషించిన వాళ్లా? అనేది ఇంకా తేలాల్సి ఉంది. అయితే తేలుతుందా? లేక ఇది కూడా టాలీవుడ్‌ నుంచి బయటపడిన ఇతర స్కాండల్స్‌లాగానే మిగిలిపోతుందా? అనేది ముందు ముందు తెలిసే అవకాశం ఉంది.

ఇప్పటికే ఈ వ్యవహారంలోకి టాలీవుడ్ ‘పెద్దలు’ ఇన్‌వాల్వ్ అయ్యారు. ఈ స్కాండల్స్‌తో టాలీవుడ్‌కు సంబంధం లేదని వీరు చెబుతున్నారు.

ఏ విషయంలో కాని టాలీవుడ్ బాధ్యత తీసుకుంది? స్కాండల్స్ విషయంలో ఆర్గనైజ్డ్‌గా వ్యవహరించినా, జవాబుదారీ దగ్గర మాత్రం టాలీవుడ్ ఆర్గనైజ్డ్‌గా ఉండదనేది ఇది వరకటి వివాదాల సమయంలోనే తేలింది. డ్రగ్స్, కాస్టింగ్ కౌచ్ అంశాల్లో టాలీవుడ్ ఎంత జవాబుదారీగా వ్యవహరించిందో అందరికీ తెలిసిందే.

ఇప్పుడు ఐదు మంది హీరోయిన్ల పేర్లు వ్యభిచారం విషయంలో వినిపిస్తున్నాయి. విశేషం ఏమిటంటే.. ఈ పేర్లు సూఛాయగా వెలుగులోకి వచ్చినవే. వీరు యూఎస్ కు వెళ్లి వెలగబెడుతున్న రాచ కార్యాల గురించి వెబ్ మీడియాలో పలు సార్లు గాసిప్స్ తరహా వార్తలు వచ్చాయి. 

తెలుగు, కన్నడ సినీ పరిశ్రమలతో సంబంధాలున్న ఇద్దరు హీరోయిన్ల వ్యవహారాలపై గతంలోనే ప్రచారం వచ్చింది. ఇప్పుడు బయటపడిన దందాలో కూడా వారిద్దరూ ఉన్నారనే మాట వినిపిస్తోంది. డైరెక్టుగా వారి పేర్లు బయటపెట్టడం లేదు. వీరు ఇద్దరు మాత్రమే కాదు..మరో ముగ్గురు పేర్లు కూడా ఉన్నట్టుగా తెలుస్తోంది.

అయితే వీరంతా బాధితులుగా ఈ కూపంలో చిక్కుకుని ఉంటే జాలిపడాలి. కావాలని చిక్కుకున్నా జాలి పడాల్సిందే.

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?