2019 సంక్రాంతి హాట్ గా మారుతోంది. ఇప్పటిక ఎన్టీఆర్ బయోపిక్ సంక్రాంతికి విడుదల అన్నది ఫిక్సయింది. జనవరి 9న ఎన్టీఆర్ బయోపిక్ ను విడుదల చేయాలని ఆలోచిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ సంగతి అధికారికంగా ప్రకటించలేదు. అయితే ఇంతలోనే డివివి దానయ్య-బోయపాటి కాంబినేషన్ లో తయారవుతున్న రామ చరణ్ సినిమాకు మాత్రం డేట్ వచ్చేస్తోంది.
సంక్రాంతికి రామ్ చరణ్ -బోయపాటి సినిమాను విడుదల చేయబోతున్నట్లు ఇప్పుడే ప్రకటించయాలని ఆలోచిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ మేరకు ఇవ్వాళో రేపో ప్రకటన వస్తుందని తెలుస్తోంది.
ప్రస్తుతం ఈ సినిమా షూట్ హైదరాబాద్ ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ లో జరుగుతోంది. సుమారు అయిదుకోట్ల భారీ బడ్జెట్ తో సినిమాలో కీలకమైన యాక్షన్ సన్నివేశాలు తెరెకెక్కిస్తున్నారు.
రామ్ చరణ్ లో మగధీర లెక్కలు పక్కన పెడితే అత్యంత భారీ బడ్జెట్ తో తయారవుతున్న సినిమా ఇదే అనుకోవాలి. రంగస్థలం సినిమాకు 70 కోట్లకు పైగా బడ్జెట్ పెడితే, ఈ సినిమాకు మరో పది కోట్లకు పైగానే అవుతోందని అంటున్నారు.
మామూలుగానే భారీగా ఖర్చు చేయించే బోయపాటి, ఈ సినిమాకు మరీ భారీగా ఖర్చుచేయిస్తున్నారు. విలన్ మీద చిత్రీకరించిన ఓపెనింగ్ సీన్ కే కోట్లు ఖర్చుచేయించారు. వేలాది మంది జూనియర్ ఆర్టిస్టులను ఎంగేజ్ చేసారు. ఇప్పుడు హీరో యాక్షన్ సీన్ల కోసం కూడా అయిదు వందల మందిని ఎంగేజ్ చేసారు.
ఇదిలా వుంటే రామ్ చరణ్ సినిమా సంక్రాంతికి అని ప్రకటిస్తున్నారు అంటే, మెగా స్టార్ చిరంజీవి భారీ సినిమా సైరా విడుదల సంక్రాంతికి లేదు అని పక్కా అయిపోయింది. మార్చి నెలాఖరులో సైరా విడుదల వుంటుందని తెలుస్తోంది.