బాలీవుడ్ సూపర్‌స్టార్ షారుక్‌ఖాన్ ‘ఓంశాంతి ఓం’ సినిమా కోసం సిక్స్ ప్యాక్ ఫిజిక్‌తో కన్పిస్తే అంతా షాక్ తిన్నారు. అది ఒరిజినల్ కాదు.. ప్లాస్టిక్‌తో చేసిన సిక్స్ ప్యాక్ జాకెట్‌ని అమర్చారంటూ అప్పట్లో గాసిప్స్ పుట్టుకొచ్చాయి. ఎవరేమనుకున్నా.. షారుక్ మాత్రం తన కష్టానికి తగ్గ రిజల్ట్ రాబట్టుకున్నాడు ఆ సినిమాతో.
ఇప్పుడు ఇంకాస్త ముందుకు వెళ్ళి, ఏకంగా ఎయిట్ ప్యాక్ ఫిజిక్ సంపాదించుకున్నాడు షారుక్‌ఖాన్. ‘హ్యాపీ న్యూ ఇయర్’ అనే సినిమా కోసం షారుక్ ఈ ఫీట్ చేశాడు. షారుక్ తాజా లుక్ చూసి అంతా షాక్ తింటున్నారు. ‘అప్పుడు ప్లాస్టిక్ అన్నారు.. ఇప్పుడేమంటారో..’ అంటూ షారుక్ సన్నిహితులు షారుక్ ఎయిట్ ప్యాక్ విషయమై ప్రత్యర్థులకు సవాల్ విసురుతున్నారు.
‘కమిట్మెంట్ విషయంలో షారుక్‌ని ఎవరూ తప్పుపట్టడానికి లేదు.. ఆయన కమిట్మెంట్ ఏంటో ఆయన సక్సెస్ఫుల్ కెరీర్‌ని చూస్తే అర్థమవుతుంది.. ఎయిట్ ప్యాక్ కోసం అతనెంత కష్టపడ్డాడో ఆయనకే తెలుసు..’ అని షారుక్ సన్నిహితులు చెబుతున్నారు. సిక్స్ ప్యాక్‌తో బ్లాక్ బస్టర్ సినిమా ‘ఓం శాంతి ఓం’ ఇచ్చిన షారుక్, ఎయిట్ ప్యాక్‌తో ‘హ్యాపీ న్యూ ఇయర్’ని ఏ రేంజ్ హిట్ చేస్తాడో వేచి చూడాలి.