అన్ని సినిమాలు ఎప్పుడు విడుదల చేద్దామా అని టెన్షన్ పడుతుంటే నాగ్ మాత్రం వైవిధ్యంగా ఆలోచిస్తున్నాడని టాక్. ఒక లైలా కోసం అన్ని పనులు పూర్తి చేసుకుని రెడీ వుంది విడుదలకు. ఈ నెల మొదటి వారంలోనే వద్దామనుకుంది లైలా. కానీ పోటీ సినిమాలు చాలా రెడీగా వుండడంతో ఆగిపోయింది. వచ్చే నెల మొదటి వారం వరకు స్లాట్ కనిపించడం లేదు.
అయినా కూడా పిసరంత టెన్షన్ పడడం లేదట. ఎప్పుడు అటో వారం ఇటొ వారం ఖాళీ వుంటే అప్పుడే విడుదల చేద్దాం తొందరేం లేదు. మన కాన్సెప్ట్ మనది..జనం కచ్చితంగా చూసేలా వుంటుంది..అందువల్ల మరేం ఆలోచించక్కర్లేదు అంటున్నాడట నాగ్. కొండా విజయకుమార్ స్క్రిప్ట్ డైరక్షన్ మీద నమ్మకమే ఇందుకు కారణమని టాక్. ఈ సినిమాను నాగ చైతన్య అన్నీ తానే చూసుకుని, నిర్మించడం విశేషం.