నాగ్ స్వంత బ్యానర్, కాదు..కాదు..నాగ్ బినామీ అనేంతగా పేరు కామాక్షి కమర్షియల్స్ కు. సుమారు 14 సినిమాలు తీస్తే అందులో ఒకటి రెండు తక్కువ అన్నీ నాగ్ తోనే. మిగిలినవి చైతన్యతో. కానీ ఇప్పుడు అలాంటి బ్యానర్ మాయమైంది. సుమంత్ రాజు గారిలా, ఆర్ ఆర్ వెంకట్ లా, ఇంకా చాలా పెద్ద బ్యానర్లలా కనుమరుగైపోయింది.
మిగిలిన వాటి సంగతేమో కానీ నాగ్ తలుచుకుంటే కామాక్షి బ్యానర్ రెపరెపలాడడం పెద్ద కష్టం కాదు. తనతో అన్ని సినిమాలు చేసిన నిర్మాత, తను, తన కొడుకు సినిమాల కారణంగానే చితికిపోతే ఓ చెయ్యి ఆసరా ఇచ్చి లేపగలిగిన సత్తా నాగ్ కు వుంది.
ఆయన తలుచుకుంటే తనదో, కొడుకుదో ఓ ప్రాజెక్టు్ వారికి ఇవ్వచ్చు. నాగ్ సినిమా చేతిలో వుందంటే ఆ మాత్రం ఫైనాన్స్ రెడీ గా వుంటుంది. పైగా అన్నపూర్ణ చేతిలో వుంది కాబట్టి ప్రొడక్షన్ కు పెద్దగా ముందస్తు పెట్టుబడి అవసరం వుండదు. కానీ ఇవన్నీ నాగ్ పెద్దమనసు చేసుకుంటేనే సాధ్యం.