ఆ విధంగా విష్ణు గ్రేటే…

ఏ హీరో కూడా పట్టుమని ఏడాదికి రెండు సినిమాలు చేయడం కష్టమైపోతోంది. ఇలాంటి సమయంలో విష్ణు ఈ ఏడాది నాలుగు సినిమాలు చేస్తున్నాడు. ఇప్పటికి రెండు విడుదలైపోయాయి. పాండవులు పాండవులు తుమ్మెద, రౌడీ. ఇక…

ఏ హీరో కూడా పట్టుమని ఏడాదికి రెండు సినిమాలు చేయడం కష్టమైపోతోంది. ఇలాంటి సమయంలో విష్ణు ఈ ఏడాది నాలుగు సినిమాలు చేస్తున్నాడు. ఇప్పటికి రెండు విడుదలైపోయాయి. పాండవులు పాండవులు తుమ్మెద, రౌడీ. ఇక ఈ నెల అనుక్షణం విడుదల కాబోతోంది. ఈ ఏడాదిలోనే దాసరి 'ఎర్రబస్సు' విడుదల కానుంది. అంటే మొత్తం నాలుగు. గతంలో ఇలాంటి రికార్డు అల్లరి నరేష్ కు సదా వుండేది. ఆయనా ఇప్పుడు తగ్గించేసాడు. 

ఇదిలా వుంటే ఇలా చకచకా మీడియం రేంజ్ సినిమాలు చేయడమే అన్ని విధాలా బాగుందని మంచు ఫ్యామిలీ భావిస్తోందట. ఇరవయ్యేసి కోట్లతో  భారీ సినిమా చేసి టెన్షన్ పడే కన్నా,. అయిదారు కోట్లలో సినిమా చేసి, ఒకటో, రెండో లాభం చేసుకోవడం, పైగా వరుసగా సినిమాలు చేయగలగడం బాగుందని సంతోషిస్తోందట.