పెళ్లి అనంతర హడావుడిలో వున్నాడు హీరో నాగ చైతన్య. అయినా చేయబోయే సినిమా షెడ్యూలు విషయంలో ముందే ప్లానింగ్ పెర్ ఫెక్ట్ గా చేసేసాడట. నవంబర్ 8 నుంచి మైత్రీ మూవీస్-చందుమొండేటి కాంబినేషన్ లోని సవ్యసాచి సినిమా షూట్ స్టార్ట్ చేస్తున్నాడు.
మధ్య మధ్యన అక్కడక్కడ నాలుగైదు రోజులు, మహా అయితే వన్ వీక్ గ్యాప్ వంతున ఫిబ్రవరి వరకు డేట్స్ ఇచ్చేసాడట ఈ సినిమాకు. హలీడేలు, పండుగలు వదిలేసి, మిగిలిన రోజులన్నీ వరుసగా వర్క్ చేస్తాడట.
మారుతి డైరక్షన్ లో సితార ఎంటర్ టైన్ మెంట్స్ నిర్మించే సినిమాకు ఈ కార్తీక మాసంలోనే పూజ అయితే జరుగుతుంది. కానీ షూట్ ఎప్పుడు అన్నది చూడాలి. వాస్తవానికి సవ్యసాచి కొంత జరిగాక మారుతి సినిమాకు డేట్స్ అడ్జస్ట్ చేస్తానని చైతూ చెప్పినట్లు వినికిడి.
కానీ ఇప్పుడు సవ్యసాచి షెడ్యూళ్లు చూస్తుంటే అది సాధ్యం అయ్యేలా లేదు. అలా అయితే దర్శకుడు మారుతి మార్చి వరకు వెయిటింగ్ లో వుండిపోయే అవకాశం వుంది. మారుతి లాంటి డైరక్టర్లకు నాలుగు నెలలు అంటే ఓ సినిమా తీసేసేంత టైమ్ మరి. అందువల్ల ఏం చేస్తారో ఈ గ్యాప్ లో ఆయన.