ఇదీ మేనేజ్ మెంట్ అంటే ?

లండన్ గ్లోబల్ అకాడమీ, గోల్డెన్ పీకాక్ అవార్డు. ఇలా వినగానే ఏమనిపిస్తుంది. అబ్బో ఇదేదో పెద్ద అవార్డు మాదిరిగానే వుందే అనే కదా? ఈ అవార్డును నిన్న మన ముఖ్యమంత్రి చంద్రబాబుకు ఇచ్చారు. Advertisement…

లండన్ గ్లోబల్ అకాడమీ, గోల్డెన్ పీకాక్ అవార్డు. ఇలా వినగానే ఏమనిపిస్తుంది. అబ్బో ఇదేదో పెద్ద అవార్డు మాదిరిగానే వుందే అనే కదా? ఈ అవార్డును నిన్న మన ముఖ్యమంత్రి చంద్రబాబుకు ఇచ్చారు.

గ్లోబల్ లీడర్ షిప్ ఇన్ పబ్లిక్ సర్వీస్ అండ్ ఎకనామిక్ టాన్సఫర్మేషన్ అవార్డు అంట. సహజంగానే ఆయన అనుకూల మీడియాలో బ్యానర్ వార్తయి కూర్చుంది. ఇక ఇదే సంస్థ బాబుగారి సతీమణి కి కార్పొరేట్ గవర్నెస్ విభాగంలో అవార్డు అందించారు.

సరే చీమ చిటుక్కు మంటే గూగుల్ న్యూస్ అందించేస్తుంది. ఇంత గొప్ప అవార్డు, లండన్ మంత్రి హాజరైన సదస్సు, గ్లోబల్ అకాడమీ అన్న ఉత్సాహంతో సెర్చ్ చేసి చూస్తే, అసలు ఎక్కడా ఆ ఊసే లేదు. గ్లోబల్ అకాడమీ అనేది సవాలక్ష ఎడ్యుకేషన్ ట్రయినింగ్ సెంటర్ల లాంటిదేనా అన్న అనుమానం కలుగుతోంది.

ఎందుకంటే మన మీడియా అందించిన వార్తల్లో కూడా అవార్డు అందుకున్నారన్నది తప్ప, అసలు ఆ సంస్థ ఏమిటి? దాని నిర్వాహకులు ఎవరు? వారి పేర్లేమిటి? అన్నవి లేవు. ఫొటోలు లేవు. మరి ఇలాంటి సంస్థ ఎందుకు సన్మానం చేసి, తొలిసారి అవార్డు క్రియేట్ చేసి మరీ ఇవ్వడం ఏమిటో? దానికి ఇంత హడావుడి ఏమిటో? జనాలు అబ్బో, మా బాబే అని అనుకోవడానికి తప్ప.