దిగ్దర్శకుడు శంకర్ రూపొందిస్తున్న భారీ చిత్రం రోబో 2.0. సూపర్ స్టార్ రజనీ, అక్షయ్ కుమార్, ఎమీ జాక్సన్ లాంటి హేమీ హేమీలు వున్నారు సినిమాలో. ఫైట్లు, ఛేజ్ లు, ఇంకా ఇంకా చాలా చాలా వుండే ఈ సినిమాలో పాటలు కాదు. ఒక్కటే పాట వుంటుందట. సంగీత దర్శకుడు రెహమాన్ బయటపెట్టారు ఈ విషయాన్ని.
దుబాయ్ లో అడియో ఫంక్షన్ సందర్భంగా రెహమాన్ ఓ ప్రశ్నకు సమాధానంగా ఈ సంగతి చెప్పారు. వాస్తవానికి మూడు పాటలు కంపోజ్ చేసానని, ఒకటి మాత్రమే సినిమాలో వుంటుదని, మిగిలిన రెండు తాను తన లైవ్ కన్సర్ట్ లో పాడతానని వెల్లడించారు.
అంటే ఆ సంగతి ఎలా వున్నా, సినిమా మొత్తం మీద ఒక్కటే పాట అది కూడా రజనీ-ఎమీల డ్యూయట్. సైన్స్ ఫిక్షన్ సినిమా మొత్తం పాటలనే రిలీఫ్ లేకుండా సాగుతుందన్నమాట. శంకర్ మ్యాజిక్ ఈ విషయంలో ఎలా వుంటుందో చూడాలి. తెలుగునాట ఈ సినిమా 81కోట్లకు హక్కులు అమ్ముడుపోయింది.