కొరటాల శివ-మహేష్ బాబు కాంబినేషన్ లో సినిమ అన్న వార్త బయటకు వచ్చిన దగ్గర నుంచి వినిపిస్తున్న టైటిల్ భరత్ అనే నేను. ఆల్ మోస్ట్ ఈ టైటిల్ పక్కా అనే అనుకుంటున్నారంతా. ఆ విధంగానే వార్తలు వస్తున్నాయి. సినిమా జనాలు కూడా అలాగే మాట్లాడుతున్నారు. ట్వీట్ లు చేస్తున్నారు.
కానీ ఇప్పుడు ఎందుకో ఆ పేరు మార్చే ఆలోచన ఏమన్నా వుందేమో అన్న అనుమానం కలుగుతోంది. ఈ రోజు ఆ సినిమా డేట్ ను ప్రకటి్ంచారు. ఏప్రియల్ 27న విడుదల తేదీ ప్రకటించే డిజైన్ మీద భరత్ అనే నేను టైటిల్ లేదు.
డివివి ఎంటర్ టైన్ మెంట్స్ ప్రొడక్షన్స్ నెంబర్ 3 అని మాత్రమే వుంది. మరి ఇక్కడ భరత్ అనే నేను టైటిల్ ను ఎందుకు పేర్కోనలేదో? కొంపదీసి టైటిల్ మార్చే ఆలోచన ఏదైనా చేస్తున్నారా? ఏమిటి?