Advertisement

Advertisement


Home > Movies - Movie Gossip

9న జగన్ దగ్గరకు టాలీవుడ్

9న జగన్ దగ్గరకు టాలీవుడ్

మొత్తానికి టాలీవుడ్ ఆంధ్రకు వెళ్తోంది. అంటే టాలీవుడ్ ఆంధ్రకు తరలి వెళ్తోంది అన్నది కాదు. సిఎమ్ జగన్ ను కలవడానికి టాలీవుడ్ పెద్దలు బయల్దేరుతున్నారు. ఈ నెల 9న అపాయింట్ మెంట్ లభించింది. ఎగ్జిబిటర్, ప్రొడ్యూసర్, స్టూడియా, డిస్ట్రిబ్యూటర్ సర్కిల్ నుంచి ఇద్దరు ఇద్దరు వంతున వెళ్తున్నారు. అలాగే ఫెడరేషన్, మా, డైరక్టర్ విభాగాల నుంచి ఇద్దరేసి వంతున వెళ్తున్నారని బోగట్టా.

ఈ మేరకు ఓ జాబితాను తయారుచేసారు. ఈ జాబితాలో బాలయ్య పేరు వుందా లేదా అన్నది క్లారిటీ లేదు. నిజానికి ఆంధ్రలో ఎమ్మెల్యే గా బాలయ్య కూడా వుండాల్సి వుంది. డైరక్టర్ ల నుంచి రాజమౌళి, త్రివిక్రమ్, కొరటాల శివ వెళ్లే అవకాశం వుంది. చిరంజీవి, నాగార్జున వుంటారని తెలుస్తోంది. మా తరపున నరేష్, జీవిత వుంటారని వినిపిస్తోంది.

ఇంతకీ ఇంత మంది ఏ ప్లాన్ తో వెళ్తున్నారో? ఏం మాట్లాడతారో? అన్నది క్లారిటీ లేదు. సిఎన్ జగన్ మాత్రం కాంక్రీట్ ప్లాన్ తో రమ్మనమని అడిగారని వార్తలు వచ్చాయి.  షూటింగ్ లు, అనుమతులు ఇక్కడ విషయం కాదు. ఆంధ్రలో సినిమా రంగ అభివృద్ధి గురించే మాట్లాడాలి. 

ఇదిలా వుంటే ఎవర్ని తీసుకెళ్తారు, ఎవర్ని వదిలేస్తారు? అన్న దానిపై ఇప్పటికే టాలీవుడ్ లో గుసగుసలు ప్రారంభమయ్యాయి. వీళ్లను ఎలా తీసుకెళ్తారు?  వాళ్లని ఎలా వదిలేస్తారు? అనే టాక్ వినిపిస్తోంది.

మాట ఇచ్చాను.. నిలబెట్టుకున్నాను

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?