Advertisement

Advertisement


Home > Movies - Movie Gossip

ఆ క్యారెక్టర్ లో ఆ నటుడు

ఆ క్యారెక్టర్ లో ఆ నటుడు

హీరో క్యారెక్టర్ అంటే నేను అంటే నేను అంటూ ముందుకు వస్తారు ఎవరైనా, కాస్త నెగిటివ్ షేడ్ వున్న క్యారెక్టర్ అన్నా, అసలు నెగిటివ్ క్యారెక్టర్ అన్నా ముందుకు రారు. మళ్లీ నెగిటివ్ షేడ్ లా వున్న హీరో క్యారెక్టర్ అయినా ముందుకు వస్తారు. అంతే కానీ హీరోలా కనిపించే నెగిటివ్ షేడ్ అంటే మాత్రం దూరంగా వుంటారు.

కాస్త కన్ఫ్యూజ్ గా వుంటే మలయాళ సినిమా కప్పెల సంగతి చూడాలి. ఈ సినిమాలో రెండు క్యారెక్టర్లు. ఒకటి మొదటి నుంచీ హీరోలా కనిపిస్తూ చివర్న విలన్ గా మారిపోయే క్యారెక్టర్. రెండవది విలన్ టచ్ అనిపిస్తూ,చివరకు హీరోలా మిగిలే క్యారెక్టర్. ఈ చిన్న సినిమా కథలో సొగసే అది. 

ఈ సినిమాను తెలుగులో తీసే ప్రయత్నంలో వుంది సితార సంస్థ. నెగిటివ్ టచ్ వున్న పాజిటివ్ క్యారెక్టర్ కు విష్వక్ సేన్ ఫిక్స్ అయిపోయారు. కానీ పాజిటివ్ టచ్ వున్న నెగిటివ్ క్యారెక్టర్ అనేసరికి ఏ చిన్న హీరో కూడా ముందుకు రావడం లేదు. ధైర్యం చేయడం లేదు. ఆఖరికి ఓ అప్ కమింగ్ నటుడు మాత్రం ఈ ప్రయోగానికి సై అన్నట్లు తెలుస్తోంది. 

కేరాఫ్ కంచరపాలెంలో నటించి, ఇప్పుడు నారప్ప సినిమా వెంకటేష్ కొడుకు గా నటిస్తున్న కార్తీక్ రత్నం కప్పెల రీమేక్ లో మెయిన్ హీరో క్యారెక్టర్ చేయడానికి ఓకె అన్నట్లు తెలుస్తోంది. ఇలా ఇటు విష్వక్ సేన్, అటు కార్తీక్ రత్నం ఫిక్స్ అయిపోతే హీరోయిన్ కోసం వెదకాల్సి వుంటుంది. అలాగే పనిలోపనిగా డైరక్టర్ కోసం కూడా. 

బోండా ఉమకి నిన్న రాత్రే ఎలా తెలిసిపోయింది

నాగ‌బాబూ ...మ‌రీ ఇంత దిగ‌జారుడేంది? 

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?