తొందరపడి ఎవరు చేస్తారని అడగకుండా, డైరక్టర్ ఎవరైతే బాగుంటారని చూసుకోకుండా, టూ కంట్రీస్ సినిమాను కొనేసాడు బండ్లగణేష్. సినిమా కొన్న ఉత్సాహంతో ఎవరితో చేద్దామా అని చూసాడు. కానీ బండ్లకు తెలుసో తెలియదో కానీ, అంతకు ముందే ఆ సినిమాను దర్శకుడు ఎన్ శంకర్ హీరో సునీల్ తో సహా కొంతమందికి చూపించారు. కానీ ఎక్కడా ఫుల్ గా గ్రీన్ సిగ్నల్ రాలేదు.
ఇప్పుడు ఈ సినిమాను బండ్ల వెంకీతో తీద్దామా, పవన్ కళ్యాణ్ ను అడుగుదామా అంటూ గాల్లో నిచ్చెనలు వేస్తున్నారు. సునీల్ ను అడిగారని, హరీష్ శంకర్, శ్రీనువైట్ల లాంటి కామడీ రైటింగ్ స్కిల్స్ వున్న డైరక్టర్లయితే తాను ఓకె అని అన్నారని వినికిడి. బండ్ల మాత్రం నాగేశ్వర రెడ్డి అంటున్నాడట. మొత్తానికి ఈ సినిమాను బండ్ల గణేష్ అలా మురగబెట్టేలా కనిపిస్తోంది వ్యవహారం.