నాగ్ చైతన్య హీరోగా మారిన ఇన్నాళ్లకు మేనమామల బ్యానర్ సురేష్ ప్రొడక్షన్స్ వైపు నుంచి ఓ సినిమా వస్తుందని వార్తలు బయటకు వచ్చాయి. వ్యాపారం దగ్గర నిక్కచ్చిగా వుండే సురేష్ బాబుకు ప్రేమమ్ హిట్ తరువాత మేనల్లుడు నాగ్ చైతన్య మీద నమ్మకం వచ్చిందన్నమాట అని ఇండస్ట్రీలో సరదా సెటైర్లు కూడా వినిపించాయి. కృష్ణ అని కొత్త దర్శకుడు ఈ సినిమాకు పని చేయాల్సి వుంది. కానీ ఇంతలోనే ఆ సినిమా వాయిదా పడింది.
దానికి ముందుగా అన్నపూర్ణ బ్యానర్ పై కళ్యాణ్ కృష్ణతో సినిమా స్టార్ట్ అయింది. దాని తరువాత సాయి కొర్రపాటి నిర్మాతగా సినిమా వుంటుంది. ఆ తరువాతే సురేష్ మూవీస్ సినిమా అని అన్నారు. కానీ ఇప్పుడు లేటెస్ట్ గా వినిపిస్తున్న గుసగుస ఏమిటంటే, ఆ సినిమా క్యాన్సిల్ అయిందని, లేదా ఇప్పట్లో వుండకపోవచ్చని. కారణాలు మాత్రం ఇదమిద్దంగా తెలియడం లేదు.
సురేష్ బాబు అన్ని విధాలా బిజీగా వుండడమో, లేదా నాగచైతన్యకు బయట ఆఫర్లు ఎక్కువగా వుండడం వల్ల, తరువాత చేద్దామనో మరి? ఏ విషయం, కొద్ది రోజుల్లో క్లారిటీ వస్తుంది.