విక్టరీ వెంకటేష్ కు సురేష్ బాబు అనే అన్నయ్య వున్నారండీ. ఎవరైనా వెంకీతో సినిమా చేయాలంటే, ఈయన దగ్గర స్క్రిప్ట్ పాసై తీరాలి. అది నెలైనా పటొచ్చు. ఏడాదైనా పట్టొచ్చు. చివరకు క్యాన్సిల్ కావచ్చు. కానీ స్క్రిప్ట్ దగ్గర రాజీ మాత్రం వుండదు. ఆయనకు పూర్తిగా నచ్చాల్సిందే.
బొమ్మరిల్లు భాస్కర్ అలాగే చూసి చూసి వెనక్కు వెళ్లారు. కిషోర్ తిరుమల సంగతీ అదే. చైతూ యుద్దం శరణం ప్రాజెక్టు బయటకు వెళ్లడానికి రీజనూ ఇదే. లేటెస్ట్ గా ఆల్ మోస్ట్ పక్కా అయిపోయి, హీరోయిన్ ఎంపిక వరకు వచ్చిన వెంకీ-తేజ సినిమా కూడా ఆగిపోయినట్లే.
ఏడాది దాటుతోంది ఈ స్క్రిప్ట్ ను దర్శకుడు తేజ చెక్కుతూ, తొలిసగం ఓకె అయిపోయింది. మలి సగం స్క్రిప్ట్ ను సురేష్ బాబుకు నచ్చేలా చేయడానికి కిందా మీదా అవుతూనే వున్నారు. ఆఖరికి ఇప్పటికీ నచ్చింప చేయలేకపోయారని గుసగుసలు వినిపిస్తున్నాయి.
ఇది పూర్తి చేసి ఎన్టీఆర్ బయోపిక్ మీదకు వెళ్లాలి తేజ. కానీ ఇది చూస్తే ఇలా వుంది. దాంతో ప్రస్తుతానికి వాయిదానా లేదా క్యాన్సిల్ అన్న సందిగ్థంలో వెంకీ-తేజ ప్రాజెక్టును వుంచేసారు. ఎకె ఎంటర్ టైన్ మెంట్స్ దీని నిర్మాత. ఇంతకీ మళ్లీ స్క్రిన్ మీద వెంకీ ఎప్పుడు కనిపిస్తారో? బాబి-చైతూ కాంబినేషన్ సినిమా కూడా పట్టాలెక్కాలంటే ఆగస్టు దాటిపోవాలి. అంటే 2018లో వెంకీ సినిమా వుండదేమో?
ఆ సంగతి అలా వుంటే ఎన్టీఆర్ బయోపిక్ దసరాకు రావడానికి ఓ అడ్డంకి తొలగిపోయిందనుకోవాలి.