ఇప్పుడయినా బన్నీ ఊ అంటాడా?

బన్నీతో సినిమా తీయాలన్నది మైత్రీ మూవీస్ కోరిక. ఇది ఎప్పటి నుంచో వుంది. కానీ బన్నీ ఊ.. ఆ అనడం లేదు. మొన్నటికి మొన్న అల్లుఅరవింద్ దగ్గర మళ్లీ ప్రస్తావించారు మైత్రీ నిర్మాతలు. మూడు…

బన్నీతో సినిమా తీయాలన్నది మైత్రీ మూవీస్ కోరిక. ఇది ఎప్పటి నుంచో వుంది. కానీ బన్నీ ఊ.. ఆ అనడం లేదు. మొన్నటికి మొన్న అల్లుఅరవింద్ దగ్గర మళ్లీ ప్రస్తావించారు మైత్రీ నిర్మాతలు. మూడు సూపర్ హిట్ లు వరుసగా ఇచ్చిన బ్యానర్ ఇది. మరి బన్నీకి ఎందుకు ఆనడం లేదో తెలియదు.

ఇదిలా వుంటే బన్నీకి ఇప్పుడు రెడీగా డైరక్టర్ లేరు. సుకుమార్ తరువాత సినిమా డేట్ లు కూడా మైత్రీ దగ్గరే వున్నాయి. సుకుమార్–బన్నీ కాంబినేషన్ కూడా హిట్ కాంబినేషన్ నే. మరి అలాంటి నేపథ్యంలో బన్నీ–సుకుమార్-మైత్రీ సినిమా వుంటే బజ్ సూపర్ గా వుంటుందన్నది వాస్తవం.

నిజానికి రంగస్థలం సినిమా కథకు మూలం బన్నీనే అని వినికిడి. ఓ పీరియాడికల్ విలేజ్ బ్యాక్ డ్రాప్ విదేశీ సినిమా సీడీని బన్నీ సుకుమార్ కు అప్పట్లో ఇచ్చాడని, ఆ కాన్సెప్ట్ నచ్చి, రంగస్థలం కథ తయారు చేసుకున్నాడని వినికిడి.

ఈ విషయాన్ని బన్నీకి సుకుమార్ గతంలో చెప్పాడని కూడా తెలుస్తోంది. అందువల్ల బన్నీకి-సుకుమార్ కు మంచి సంబంధాలే వున్నాయి. పైగా ఇప్పుడు సుకుమార్ మళ్లీ ప్రూవ్ చేసుకున్నాడు కూడా. అందువల్ల బన్నీ తరువాత ప్రాజెక్టుగా మైత్రీ సినిమా ఓకె అవుతుందేమో? చూడాలి.