యాక్షన్ కాదు.. డబుల్ యాక్షన్

ఫుల్ సక్సెస్ లైన లో వెళ్తున్న హీరో నాని మరో సినిమా కృష్ణార్జున యుద్ధం మరో రెండు వారాల్లో విడుదలకు రెడీ అయిపోతోంది. ఈ సినిమా ట్రయిలర్ ను ఈరోజు విడుదల చేసారు. సినిమాను…

ఫుల్ సక్సెస్ లైన లో వెళ్తున్న హీరో నాని మరో సినిమా కృష్ణార్జున యుద్ధం మరో రెండు వారాల్లో విడుదలకు రెడీ అయిపోతోంది. ఈ సినిమా ట్రయిలర్ ను ఈరోజు విడుదల చేసారు. సినిమాను అవుట్ రేట్ గా దిల్ రాజు కొనడంతో ఆయన తన యూట్యూబ్ చానెళ్లో ట్రయిలర్ ను విడుదల చేసారు.

ఇప్పటికే ఈ సినిమా సంగతులు వార్తల్లోకి బోలెడు వచ్చేసాయి. ఇప్పుడు ట్రయిలర్ లో కూడా అవే వున్నాయి. పక్కా లోకల్ మాస్ కుర్రాడు కృష్ణ, విదేశాల్లో వున్న ఇండియన్ పాప్ సింగర్ అర్జున్. ఇద్దరూ చెరో అమ్మాయిని ప్రేమించడం, ఆ అమ్మాయిల కోసం కలిసి యుద్దం చేయడం అన్నది ట్రయిలర్ లో కూడా దాదాపు రివీల్ అయింది.

ట్రయిలర్ రిచ్ గా వుంది. పంచ్ పలుకులు కూడా రెండు మూడు పడ్డాయి. 'యుద్దం వస్తే యుద్దం చేయాలి, పద్యం పాడకూడదు', 'చెప్పు చూపించింది ఆ అమ్మాయి ఊరికి కొత్తయివుంటుంది'. 'సిన్సియర్ గా ఓ అమ్మాయిని లవ్ చేయడం, ఇటాలియన్ మాఫియాతో పెట్టుకోవడం రెండూ ఒకటే' లాంటి ఫన్ డైలాగులు ట్రయిలర్ లో బాగానే పడ్డాయి.

సినిమా రిచ్ లుక్ కనిపిస్తోంది. కలర్ ఫుల్ గా వుంది. అనుపమ, నాని లుక్స్ బాగున్నాయి. పక్కా లోకల్ నాని మనకు పరిచయమే. అలాగే వున్నాడు. అందులో కొత్తేం లేదు. రాక్ స్టార్ నాని కాస్త కొత్తగా వున్నాడు.