కొత్త ప్రాజెక్టులు ఏవీ ఒప్పుకోలేదు అని హీరో వరుణ్ తేజ ఓ ట్వీటు విసరగానే, అనిల్ రావిపూడి తలపెట్టిన ఎఫ్ 2 సినిమా అయిపోయినట్లే, ఆగిపోయినట్లే అని వార్తలు వచ్చేసాయి. విక్టరీ వెంకటేష్ కాంబినేషన్ లో అనిల్ రావిపూడి డైరక్షన్ లో దిల్ రాజు ఒక సిన్మా నిర్మించాలని అనుకన్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలో ఇద్దరు హీరోలు వుంటారు. వెంకీకి తోడుగా వరుణ్ తేజ అని అనుకున్నారు.
కానీ ఈ ట్వీట్ తో అనిల్ రావిపూడి సినిమా మళ్లీ మొదటికి వచ్చిందని అనుకున్నారంతా. కానీ తెలుస్తున్న విషయం ఏమిటంటే, ఈ ప్రాజెక్టు పక్కా అంట. సంక్రాంతికి ఈ ప్రాజెక్టును దిల్ రాజే స్వయంగా అనౌన్స్ చేస్తారట. వాస్తవానికి ఎవరు పడితే వాళ్ల తమ సినిమాలో వరుణ్ తేజ చేస్తున్నారని చెబుతుండడంతో ఆ ట్వీట్ చేసాడట. దిల్ రాజు-అనిల్ రావిపూడి సినిమా మాత్రం పక్కాగా వుంటుందట.
హీరోలు వెంకీ, వరుణ్ ఫిక్స్ కానీ, హీరోయిన్లు ఇంకా ఫిక్స్ కాలేదట. వీలయితే సంక్రాంతి లోగా ఫిక్స్ చేసి, టోటల్ కాంబినేషన్ అనౌన్స్ చేయాలన్నది దిల్ రాజు ఆలోచన అని తెలుస్తోంది.