‘హలో’ నష్టాల భర్తీకి ’రంగులరాట్నం‘!

డిస్ట్రిబ్యూటర్లకు నష్టాలను భర్తీ చేయడం అన్నది నిర్మాతలకు ఇవాళ్టి రోజుల్లో పెద్ద భారంగా మారిపోయింది. చిన్నకొడుకు అఖిల్ హీరోగా అన్నపూర్ణ బేనర్ మీద నాగార్జున ప్రతిష్టాత్మకంగా నిర్మించిన చిత్రం ‘హలో’ బాక్సాఫీసు వద్ద నిరాశపరచిన…

డిస్ట్రిబ్యూటర్లకు నష్టాలను భర్తీ చేయడం అన్నది నిర్మాతలకు ఇవాళ్టి రోజుల్లో పెద్ద భారంగా మారిపోయింది. చిన్నకొడుకు అఖిల్ హీరోగా అన్నపూర్ణ బేనర్ మీద నాగార్జున ప్రతిష్టాత్మకంగా నిర్మించిన చిత్రం ‘హలో’ బాక్సాఫీసు వద్ద నిరాశపరచిన తర్వాత.. నష్టపోయిన నిర్మాతలకు కాంపన్సేట్ చేసే పనిలో పడ్డట్టుగా తెలుస్తోంది. అన్నపూర్ణ బేనర్ మీదనే నిర్మిస్తున్న ‘రంగులరాట్నం’ చిత్రాన్ని హలో డిస్ట్రిబ్యూటర్లకు సంక్రాంతికి విడుదలగా ఇస్తున్నట్లు వినిపిస్తోంది.

రాజ్ తరుణ్ హీరోగా.. రంగులరాట్నం సినిమా రూపొందింది. సంక్రాంతి బరిలో పెద్ద సినిమాల పోటీ మధ్యలో ఫీల్ గుడ్ కంటెంట్ తో ఓ చిన్న సినిమా ఉన్నా మంచి రిజల్ట్ ఉంటుందని గత ఏడాది సంక్రాంతి బరిలోని చిత్రాలు నిరూపించాయి. ఈ సారి కూడా ‘రంగులరాట్నం’ సినిమాకు అలాంటి మాజికల్ రిజల్ట్ వర్కవుట్ అవుతుందని అనుకుంటున్నారు.

హలో చిత్రం బాక్సాఫీసు వద్ద నిరాశ పరచడం నాగార్జునకు అనుకోని దెబ్బ. ఆ సినిమా తీసుకుని నష్టపోయిన వారినుంచి ఆయన మీద ఒత్తిడి బాగా పెరిగినట్లు సమాచారం. అందుకే వారికి నష్టపరిహారం కల్పిస్తున్నట్లుగా ఈ చిత్రం ఇచ్చేస్తున్నారు.

జనవరి 14న రంగులరాట్నం విడుదల కాబోతోంది. ఆరోజు ఆదివారం అయినప్పటికీ.. పండగ నేపథ్యం కూడా తోడై ఓపెనింగ్ కలెక్షన్లు బాగానే ఉండవచ్చుననే ఆశతో విడుదలకు ముహూర్తం నిర్ణయించేశారు. మొత్తానికి హలో నష్టాల భర్తీ గురించి ఒత్తిడి రాకుండా.. రంగులరాట్నం వారి చేతుల్లో పెట్టేసి నాగార్జున రిలీఫ్ పొందుతున్నారని అంతా అనుకుంటున్నారు.