Advertisement

Advertisement


Home > Movies - Movie Gossip

ఆ కాంబినేషన్ ఆలోచనే లేదు

ఆ కాంబినేషన్ ఆలోచనే లేదు

ఉన్నట్లుండి గ్యాసిప్ గుప్పుమంది. శ్రీకాంత్ అడ్డాలకు హీరో నాని డేట్ లు ఇచ్చాడని. అది తెలిసి ఎవరైతే సినిమా తీస్తారని రాస్తున్నారో, వాళ్లే ఆశ్చర్యపోతున్నారు. గీతాలో శ్రీకాంత్ అడ్డాల సినిమా చేయాలి. అది నిజమే. కానీ నానితో అన్న ఆలోచనే గీతాలో లేదు. ఇక శ్రీకాంత్ అడ్డాలతో కాంబినేషన్ అన్నది అసలే లేదు.

ఆలు లేదు.. చూలు లేదు అన్నట్లుగా, నిర్మాతకు ఆ ఆలోచన లేదు, హీరోకి లేదు. మధ్యలో గ్యాసిప్ మాత్రం గుప్పుమనేసింది. అంతేకాదు ఆ గ్యాసిప్ ను పట్టుకుని, విశ్లేషణలు కూడా మొదలైపోయాయి. ఈ కాంబినేషన్ మంచిదేనా? కాదా? వుంటుందా? ఊడుతుందా? అంటూ. ప్రస్తుతం నాని విక్రమ్ కే కుమార్ సినిమా, అలాగే ఇంద్రగంటి సినిమా ఓకె చేసాడు. ఆ తరువాత ఏమిటి? అన్నది ఇంకా ఫిక్స్ కాలేదు.

నిర్మాత బండ్ల గణేష్ ట్రయ్ చేస్తున్నాడు నాని డేట్ ల కోసం. కానీ ఫలితం దక్కేలాలేదు అని సమాచారం. ఒకరిద్దరు డైరక్టర్లకు లైన్ లు వినడానికి ఒకె అన్నాడు. అవి సెట్ అయితే, ఓ పెద్ద బ్యానర్ లోనే సినిమా వుంటుందని తెలుస్తోంది. గీతా అయితే మాత్రం కాదు.

ఎన్టీయార్‌ పేరుతో గెలిచేశారు.. లంచం తీసుకుంటే పట్టించారు

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?