ఎప్పుడో జమానా కాలం నాడు మాంచి ఫ్లో లో వున్న హీరోలతో సినిమాలు తీసి, వాళ్లకు మరిచిపోలేని ఫ్లాపులు ఇచ్చాడు ఓ డైరక్టర్. ఆ తరువాత అతగాడిని పట్టించుకున్నావారు లేరు. ఆయన కూడా సినిమాలు వదిలేసినట్లు కనిపించాడు. ఉన్నట్లుండి ఈ మధ్య ఆ డైరక్టర్ లైమ్ లైట్ లోకి వచ్చాడు. ఓ పెద్ద హీరో వెంట కనిపించడం, ఆయన తలపెట్టిన కార్యక్రమాల్లో చరుగ్గా కనిపించడం తో జనాలకు ఆశ్చర్యం వేసింది.
అక్కడితో ఆగలేదు. ముఖ్యమంత్రిని కలిసేంత ముఖ్యమైన పనులకు కూడా పక్కన ఈ దర్శకుడు వుండేసరికి సినిమా జనం చెవులు కొరుక్కున్నారు. ఇంత మంది హేమా హేమీలు వుండగా, ఆ డైరక్టర్ ను తీసుకెళ్లడం ఏమిటి? అని కామెంట్లు వినిపించాయి. మరి ఆ కామెంట్లు పైదాకా వెళ్లాయో ఏమిటో? నిన్నటికి నిన్న జరిగిన కీలక ఇండస్ట్రీ సమావేశానికి ఆ డైరక్టర్ కు పిలుపు అందలేదు.
రాజమౌళి, త్రివిక్రమ్ లాంటి టాప్ డైరక్టర్లు, ఇంకా పలువురుడైరక్టర్లు పాల్గొని అసలు సినిమా షూటింగ్ లు అతి తక్కువ మందితో చేయడం సాధ్యమైనా? 50 నుంచి 100 మందితో సినిమా షూట్ ఏలా చేయాలి? ఇలాంటివి అన్నీ కలిపి డిస్కస్ చేసారు. ఈ డిస్కషన్ కు ఆ ఫ్లాపులు ఇచ్చిన డైరక్టర్ ను పిలవకుండా పక్కన పెట్టడం విశేషం. 'పెద్దస్టార్' తో సినిమా ఓకె అయింది, నన్ను పిలవకపోవడం ఏమిటి? అని ఆ డైరక్టర్ తెలుసుకున్నవాళ్ల దగ్గర బాధపడ్డాడట. అదీ సంగతి.