Advertisement

Advertisement


Home > Movies - Movie Gossip

ఆ డైరక్టర్లు అక్కడ బిజీ

ఆ డైరక్టర్లు అక్కడ బిజీ

కాలం మారుతోంది. విషయం వున్నవాళ్లకు, ఆ విషయం ప్రూవ్ చేసుకున్నవాళ్లకు, ఆ విధంగా పాపులర్ అయిన వాళ్లకు అవకాశాలు వెదక్కుంటూ వస్తున్నాయి.  ఆహా ఓటిటి ప్లాట్ ఫారమ్ కు పలువురు క్రియేటివ్ పీపుల్ కావాల్సి వచ్చారు. కంటెంట్ డిస్కస్ చేయడం, ఎంపిక చేయడం, కొత్త ఐడియాలు ప్లాన్ చేయడం ఇలా. అల్లు అరవింద్ భాగస్వామి కావడం, సినిమా రంగాన్ని మించి క్రియేటివ్ పీపుల్ ఎక్కడ వుంటారు? అనే భావన వుండడంతో, పలువురు సినిమా జనాలకు ఆహా నుంచి ఆహ్వానాలు అందాయి. 

నిర్మాతలు శరత్ మరార్, రాజీవ్ రెడ్డి లాంటి వాళ్లు ఆరునెలల పాటు వాళ్ల వాళ్ల అనుభవాన్ని అందించారు.తరువాత వదిలేసారు. అయితే కంటెంట్ విషయంలో మాత్రం కొందరు దర్శకులు ఆహాలో బిజీగా వున్నారు. ఔత్సాహికులు కావచ్చు, వేరే వాళ్లు కావచ్చు తెచ్చే స్క్రిప్ట్ లు చూడడం, వారిని గైడ్ చేయడం, లేదా సినిమా రంగంలోని వారితో కంటెంట్ రెడీ చేయించడం లాంటి క్రియేటివ్ పనులు వీళ్లు చూస్తున్నారని తెలుస్తోంది.

అందులో కీలకంగా వంశీ పైడిపల్లి, నందినీ రెడ్డి వున్నారని బోగట్టా. అలాగే విఐ ఆనంద్, చంద్ర సిద్దార్ధ లాంటి వారు కూడా వాళ్ల అనుభవాన్ని అక్కడ ఉపయోగిస్తున్నారట. మొత్తం మీద తెలుగు కంటెంట్ కోసం ఏర్పాటు చేసిన ఓటిటిలో తెలుగు ఇండస్ట్రీ జనాలు మమేకం కావడం, మంచి కంటెంట్ రావడానికి దారితీస్తే మంచిదే.

నాలుగు దశాబ్దాల తెలుగుదేశం

రైతులు త్యాగం చేశారా.. డీల్ చేసుకున్నారా ?

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?