Advertisement

Advertisement


Home > Movies - Movie Gossip

ఆ హీరోకి నచ్చని ఒకే ఒక్క పదం

ఆ హీరోకి నచ్చని ఒకే ఒక్క పదం

ఆయనో సీనియర్ హీరో. ఏ క్షణం మూడ్ ఎలా వుంటుందో ఆయనకే తెలియదు. అలాంటి హీరో దగ్గర తరచు ఒకే మాట వినిపిస్తూ వుంటే ఎలా వుంటుంది…మామూలుగా వుండదు. సర్రుమంటుంది ఎక్కడో. 

అందుకే మరోసారి ఆ మాట తన దగ్గర అనడానికి వీల్లేదు అని హుకుం జారీ చేసారట. ఇంతకీ విషయం ఏమిటంటే సదరు సీనియర్ హీరో ఓ సినిమా చేస్తున్నారు. భీభత్సమైన యాక్షన్ సినిమా. ఈ సినిమాకు అప్పుడప్పుడు అవసరమైన సలహాలు ఆ హీరో ఇస్తున్నారట.

అలా ఏదైనా చెబుతున్నపుడల్లా డైరక్టర్ నోటి వెంట…’దాంతో నేను కంటిన్యూ అవుతున్నా…వాళ్లతో నేను కంటిన్యూ అవుతున్నా…’ అనే మాట వినిపిస్తోందట. ఓ ఫైట్ సీన్ కు ఫలానా ఫైటర్లను పెట్టమని అడిగితే, ఇప్పుడు చేస్తున్న వాళ్లతో ఎప్పటి నుంచో కంటిన్యూ అవుతున్నా అంటూ మళ్లీ సమాధానం వచ్చిందట.

దాంతో సదరు సీనియర్ హీరోకి బిపీ సర్రున లేచి, మరోసారి కంటిన్యూ అనే పదం తనకు వినిపించడానికి వీల్లేదని అన్నారట. దాంతో తనకు అలవాటైన ఆ కంటిన్యూ ఊతపదాన్ని వాడలేక, వాడకుండా వుండలేక, అది వాడే తన అభ్యంతరాలు అన్నీ కన్వే చేస్తూ వస్తున్న డైరక్టర్ కిందా మీదా అవుతున్నారట.

నేను రెడ్డి అని ఎందుకు పెట్టుకున్నానంటే...

జ‌గ‌న్ ను చూసి నేను మారను