అబ్బాయి లోకేశ్ అజ్ఞానం పుణ్యమా అని తండ్రి చంద్రబాబుకు చీవాట్లు తప్పడం లేదు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌పై విమర్శలు చేసే క్రమంలో గతాన్ని మరిచి నోటికొచ్చినట్టు లోకేశ్ మాట్లాడ్డం చిక్కులు తెస్తోంది. కుప్పంలో చంద్రబాబు పర్యటన వివాదాన్ని సృష్టించింది. చివరికి టీడీపీ స్థానిక నేతల్ని జైలుపాల్జేసింది. జైల్లో వున్న టీడీపీ కార్యకర్తలు, నేతల్ని పరామర్శించేందుకు లోకేశ్ చిత్తూరు వెళ్లారు.
పరామర్శ అనంతరం జైలు బయట ఆయన మీడియాతో మాట్లాడుతూ జగన్‌పై చేసిన వ్యాఖ్యలు నెటిజన్లకి ఆయుధాలయ్యాయి. లోకేశ్ ఏమన్నారంటే…
“నీలాగా ప్రభుత్వ సొమ్మును దొబ్బి జైలుకు వెళ్లలేదు. బాబాయిని చంపి జైలుకు వెళ్లలేదు. నీలాగా చెల్లి, తల్లిని మెడపట్టి బయటికి గెంటి జైలుకు వెళ్లలేదు. ప్రజల సమస్య కోసం, అన్న క్యాంటీన్ కోసం పోరాడినందుకు జైలుకు వెళ్లారు. హీరోలుగా బయటికి వస్తారు ” అని సీఎం జగన్‌పై లోకేశ్ రెచ్చిపోయారు.
లోకేశ్ యాక్షన్‌పై సోషల్ మీడియా ఘాటుగా రియాక్ట్ అయ్యింది.
“మీ నాన్నలాగా పిల్లనిచ్చిన మామను వెన్నుపోటు పొడిచి జగన్ సీఎం కాలేదు. మీ నాన్నలాగా బామ్మర్దులను, సడుగుడిని వాడుకుని… ఆ తర్వాత పార్టీ నుంచి ఎవర్నీ గెంటేయలేదు. బాబు వస్తే జాబు వస్తుందని నమ్మించి …చివరికి మీకు (లోకేశ్) మాత్రమే ఉద్యోగం (మంత్రి పదవి) ఇచ్చారు. ఇలా జగన్ చేయలేదు. మాట్లాడే ముందు ఒక్కసారి వెనక్కి తిరగజూసుకో పండిత పుత్ర” అని నెటిజన్లు సెటైర్స్ విసరడం ఆసక్తి కలిగిస్తోంది.
లోకేశ్ తన అజ్ఞానంతో తండ్రిని తిట్టిస్తున్నారనే కామెంట్స్ సోషల్ మీడియాలో కనిపిస్తున్నాయి. తాను అజ్ఞానంలో మునిగితేలుతూ, లోకం కూడా అట్లే వుంటుందని భ్రమల్లో బతకడం వల్లే లోకేశ్ నోటికొచ్చినట్టు అవాకులు చెవాకులు పేలుతున్నారనే కామెంట్స్ వెల్లువెత్తుతున్నాయి.