శతృవులు ఎక్కడో లేర్రా…మన ఇంట్లోనే మన చుట్టూనే తిరుగుతూ వుంటారు అంటారు దర్శకుడు త్రివిక్రమ్. మెగా హీరోల పరిస్థితి చూస్తుంటే అలాగే వుంది. వాళ్ల సినిమాలే వాళ్ల కాళ్లకు అడ్డం పడుతున్నాయి.
మామయ్య పవన్ కళ్యాణ్ కు మేనల్లుళ్లు సాయితేజ్, వైష్ణవ్ అంటే చాలా ఇష్టం. కానీ ఏం లాభం ఆ మామయ్య జల్సా సినిమానే వైష్ణవ్ రంగ రంగ వైభవంగా సినిమా ఓపెనింగ్ కు అడ్డం పడుతోంది. మెగా సినిమాకు తొలి రోజు టికెట్ లు తెగేది మెగా ఫ్యాన్స్ వల్లనే. సినిమా భారీ దైనా, టాక్ బాగున్నా అప్పుడే మిగిలిన జనం తొలి రోజు థియేటర్ కు వచ్చేంది.
ఇప్పుడేమయంది. పవన్ బర్త్ డే సందర్భంగా సెప్టెంబర్ 1 న ‘జల్సా’ సినిమాను రెండు రాష్ట్రాల్లో స్పెషల్ స్క్రీనింగ్ చేస్తున్నారు. థియేటర్ మీద థియేటర్, షో మీద షో యాడ్ చేసుకుంటూ వెళ్లిపోతున్నారు. పవన్ ఫ్యాన్స్ క్రేజ్, ఊపు అలా వుంది. అంత వరకు ఓకె. కానీ జల్సా హడావుడి అయిన మర్నాడే అంటే 2న ‘రంగ..రంగ’ విడుదలవుతోంది. బుకింగ్ లు ఓపెన్ అయినా, మెగా ఫ్యాన్స్ అంతా జల్సా హడావుడి లో వున్నారు. అటు దృష్టి పెట్టడం లేదు.
1న ఇంత మెగా హడావుడి అయిన తరువాత మళ్లీ వెంటనే 2న ‘రంగ..రంగ’ మీద దృష్టి పెడతారా? అన్నది అనుమానం. ఒక రోజో రెండు రోజులో లేటుగా వెళ్తారు అనుకుంటే ఈ లోగా సినిమా నిలబడడానికి పాజిటివ్ టాక్ తో పాటు సూపర్ అనే టాక్ రావాలి. అప్పుడే మెగా ఫ్యాన్స్ కు ఊపు వస్తుంది.