మాజీ ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడుకు నగరి వైసీపీ ఎమ్మెల్యే, మంత్రి ఆర్కే రోజా మంచి సలహ ఇచ్చారు. కుప్పంలో చంద్రబాబు ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి కుప్పంలో తన సత్తా ఎంటో చూపించాలని చాల మంచి సలహా ఇచ్చారు.
కుప్పం టీడీపీ కార్యకర్తలను పరమర్శించడానికి వచ్చిన నారా లోకేష్ పై తనదైన శైలిలో కౌంటర్ ఇంచారు. వార్డు మెంబర్ గా కూడా గెలవని ఉత్తర కుమారుడు లోకేష్ సీఎం జగన్ ను విమర్శిస్తున్నడని ఎద్దేవా చేశారు. లోకేష్ కుప్పంలో ప్రచారం చేశాకే కుప్పం మునిసిపాలిటీ ఓడిపోయారా లోకేష్ ను వివర్శించారు. కుప్పంలో టీడీపీ సత్తా ఉంటే చంద్రబాబు రాజీనామా చేసి గెలవలన్నారు.
మంత్రి రోజా చెప్పినట్లు చంద్రబాబు కుప్పంలో రాజీనామా చేసి ఉపఎన్నికల్లోకి వెళ్లి గెలిస్తే రాష్ట్రంలో ఇంకా ఎక్కడ కూడా కుప్పం గురించి మాట్లడూకోరు కాదా అంటూన్నారు రాజకీయ విశ్లేషకులు కూడా. గెలవలేకపోతే వచ్చే ఎన్నికల్లో చంద్రబాబు నాయుడు నియోజకవర్గం కూడా మారాచ్చు కాదా అని అంటూన్నారు.
ఇలాంటి మంచి ఆవకాశం చంద్రబాబు వదులుకోకుండా రాజీనామా చేసి ఎన్నికలకు వెళ్లి గెలిస్తే టీడీపీ రాష్ట్రంలో బలపడినట్లు అవుతుంది. అయిన చంద్రబాబు రాజకీయం తెలిసిన వారు ఎవరూ కూడా చంద్రబాబు అలాంటి పని చేయారు అని అంటూన్నారు. ఎందుకంటే కుప్పంలో ఓడిపోతే ఇంకా టీడీపీ ఆఫీసు మూసివేయాల్సి వస్తుందని అందరి కంటే చంద్రబాబుకు బాగా తెలుసూ.