అమెరికాని ఆక్రమించుకుంటున్న భారతీయులు

కొన్ని దశాబ్దాల క్రితం అమెరికా అంటే బహుదూరదేశం. అక్కడ ఉత్తరం రాస్తే ఇండియాలో ఒక పల్లెటూరికి రావడానికి 10-15 రోజులపైన పట్టేది. మళ్లీ జవాబు రాస్తే 10-15 రోజులకి కానీ చేరేది కాదు. అంటే…

కొన్ని దశాబ్దాల క్రితం అమెరికా అంటే బహుదూరదేశం. అక్కడ ఉత్తరం రాస్తే ఇండియాలో ఒక పల్లెటూరికి రావడానికి 10-15 రోజులపైన పట్టేది. మళ్లీ జవాబు రాస్తే 10-15 రోజులకి కానీ చేరేది కాదు. అంటే ఇద్దరి మధ్య డయలాగ్ ఎక్స్చేంజ్ అవ్వాలంటే నెల పట్టేదన్నమాట. ఫోన్లున్నా కాల్స్ ఖరీదెక్కువ. ఐ.ఎస్.డి బుక్ చేసి “హలో బాగున్నావా నాన్నా!” అన్నదానికే మీటర్ గిర్రున తిరిగేది. 

దేశం కాని దేశంలో మావాడు ఎలా ఉన్నాడో అని ఇండియాలో తల్లిదండ్రులు, అమ్మా-నాన్న ఎలా ఉన్నారో అని అమెరికాలో కొడుకు తపించిపోయేవారు. 

సొంత ఊరిమీద, ఇంటి మీద, బంధువుల మీద, స్నేహితుల మీద మమకారముండేది. ఇండియా ప్రయాణమంటే ప్రాణం లేచొచ్చేది. సొంత ఊరికి ఫ్లైట్లో దిగగానే చంద్రమండలం మీదనుంచి వచ్చినవాడిని చూసినట్టు చూసేవారు. అమెరికా నుంచి సెంటు బాటిల్ తెచ్చినా, ఎలక్ట్రిక్ షేవర్ తెచ్చినా, వాక్-మేన్ తెచ్చినా అపురూపంగా చూసేవారు. ఆ అటెన్షన్ ని ఎంజాయ్ చేసేవాడు అమెరికా నుంచి వచ్చిన కొడుకు.  

కానీ క్రమక్రమంగా రోజులు మారాయి. రెండు దేశాల మధ్య భౌతిక దూరం అలాగే ఉన్నా సాంకేతికత వల్ల దగ్గరగా ఉన్నట్టే ఉంది. 

“అమెరికా నుంచి వస్తున్నాను. ఏం కావాలో చెప్పు” అని అమెరికా లో ఉన్నవాడు ఇండియాలో ఉన్న ఫ్రెండ్ నో, బ్రదర్నో అడిగితే అక్కడా ఇక్కడా రేట్లు కంపేర్ చేసుకుని “పెద్ద తేడా ఏం లేదు. ఇక్కడే అన్నీ దొరుకుతున్నాయిలేరా. ఏమీ వద్దు” అనే వాళ్లు చాలామంది ఉంటున్నారు. 

కుదిరితే ఫ్లైటెక్కే ముందు డ్యూటీ ఫ్రీలో ఫలానా సరుకు తీసుకురమ్మంటున్నారు తప్ప అమెరికాలో ఇక్కడ లేనివేవో ఉంటాయనే అపోహల్లో ఎవరూ ఉండట్లేదు. 

క్రమంగా అమెరికాలో ఉన్నవాళ్లకి కూడా తరచూ ఇండియా వెళ్లాలనే కోరిక తగ్గుతోంది. వెళ్లినా ఒకప్పటి అటెన్షన్ ఉండట్లేదు. కారణమేంటంటే ఎవరూ ఎవర్నీ మిస్సవ్వట్లేదు. 

వీడియో కాల్స్ లో తరచూ మాట్లాడుకుంటున్నారు. 

వాట్సాప్ గ్రూపుల్లో “మనం”, మేము”, “కుటుంబం” లాంటి పేర్లు పెట్టుకుని ఫ్యామిలీ మెంబర్స్ అందరూ టచ్ లో ఉంతున్నారు.

అమెరికాలోనే పుట్టి పెరుగుతున్న పిల్లలు కూడా ఇండియాలోని తమ కజిన్స్ తో తరచూ వీడియో కాల్స్ తో టచ్ లోనే ఉంటున్నారు. 

బర్త్ డేలు, చిన్నచిన్న వేడుకలు లైవ్ వీడియోలో చూసేస్తున్నారు. అమెరికాలో “మనబడి” లాంటివి రావడంతో భాషాపరంగా తమ పిల్లలు ఏదో మిస్సైపోతున్నారన్న బాధ ఉండట్లేదు. 

ఎలా చూసుకున్నా అన్ని విధాలుగా అమెరికా బాగుంటోంది. 

అందుకే ఒకప్పట్లాగ “పది పదిహేనేళ్లు అమెరికాలో పని చేసి తిరిగి ఇండియా వెళ్లిపోవాలి” అనే ఆలోచన చాలామందిలో తగ్గిపోయింది. అమెరికాలో సెటిలైపోవడానికే మొగ్గు చూపుతున్నారు. 

గ్రీన్ కార్డ్, సిటిజెన్షిప్ లక్ష్యంగా పని చేస్తున్నారు. ఆస్తులు కూడా ఇండియాలో పేరెంట్సుంటే కొంటున్నారు తప్ప లేకపోతే ఉన్నవి అమ్మేసుకుని పట్టుకుపోతున్నారు కూడా. అమెరికాని సొంత దేశంగా భావిస్తున్న భారతీయులు ఎక్కువగా పెరుగుతున్నారు. 

ఇక్కడే కథ మొదలౌతోంది. 

తనవరకు మాత్రమే సుఖంగా బతకడానికి కావల్సింది సంపాదించుకోవాలనుకోవడం కేవలం పాశ్చాత్యుల్లోనే ఎక్కువగా ఉంటుంది. ఇండియన్స్ కి సంపాదన మీద ఆకలెక్కువ. ఎందుకంటే వెనకాలున్న పిల్లలకి, మనవలకి కట్టబెట్టాలనే తపన. అది మనవాళ్ళ డీ.ఎన్.ఏ లోనే ఉంది. ఏ దేశమేగినా ఆ గుణం మాత్రం మారదు కదా. 

అందుకే విద్యార్థులుగానో, సాఫ్ట్ వేర్ ఉద్యోగులుగానో అమెరికాకి వెళ్లిన వాళ్ళు దాంతో ఆగట్లేదు. ఇండియాలో ఏయే రంగాల్లో మనవాళ్లు సంపాదిస్తున్నారో ఆయా రంగాల్లో చేతులు పెట్టి చక్రాలు తిప్పేస్తున్నారు. 

రియల్ ఎస్టేట్, డైమండ్స్ వ్యాపారం, పెట్రోల్ బంకులు, రెస్టారెంట్స్, బొటిక్స్ ఇలా ఒకటి కాదు..రకరకాల రంగాల్లో దూసుకుపోతున్నారు. 

అంతే కాదు రాజకీయాల్లో అడుగుపెట్టడానికి ఆసక్తి చూపిస్తున్నారు. సిటీ లెవెల్ రాజకీయాలతో మొదలుపెట్టి, సత్తా చాటుకుని క్రమంగా డెమాక్రటిక్ పార్టీ తరపునో, రిపబ్లిక్ పార్టీ తరపునో భవిష్యత్తులో టికెట్ పొంది గవర్నర్ల స్థాయికి ఎదగాలనే కోరికతో ఉంటున్నవారున్నారు. 

ఆ రెండు పార్టీల్లోని టాప్ లీడర్స్ తో స్నేహం చేసి పీ.ఆర్ పెంచుకుంటున్నారు. అంతా ఒక ఆర్గానిక్ వేలో వారి ఇష్టమైన రంగాల్లో పాగా వెయ్యడానికి మార్గాలు వేసుకుంటున్నారు. 

ఇదిలా ఉంటే భారతీయుల జనాభా అమెరికాలో పెరుగుతోంది. అయితే పెరుగుతున్న ఆ ఇండియన్ పాపులేషన్లో 90% మంది ఆ దేశం స్టాండర్డ్స్ ని బట్టి బాగా సంపాదిస్తున్నవారే. వారందరికీ ఇల్లు కొనుక్కోవడం జీవిత ధ్యేయాల్లో ఒకటి. అందుకే ఈ మధ్య ఆశ్చర్యకరంగా అమెరికన్ బిల్డర్స్ కూడా ఇండియన్ కష్టమర్స్ ని ఆకట్టుకోవడానికి “ఈస్ట్ ఫేసింగ్ హోంస్” అంటూ వాస్తు ప్రకారం కట్టి అమ్ముతున్నారు. అలా క్రమంగా ఇండియన్ సెంటిమెంట్స్ ని, సిస్టం ని అమెరికాలో వారికి తెలియకుండానే ప్రవేశ పెట్టేస్తోంది మనవాళ్ల ప్రాబల్యం. 

ఇది సైలెంట్ ఆక్రమణ. ఇప్పటికే అమెరికాలోని పలు నగరాలు ఇండియన్స్ తో నిండిపోతున్నాయి. మార్నింగ్ వాక్ లో చూస్తే ఇండియన్స్ విపరీతంగా కనిపిస్తున్నారు. కొన్ని చోట్ల ర్యాండం గా తల తిప్పి పరికిస్తే కచ్చితంగా కనీసం ఒక్క ఇండియన్ అయినా కనిపించకుండా ఉండడు. 

వైట్ అమెరికన్స్ అయినా, ఆఫ్రో అమెరికన్స్ అయినా తమ వరకు సంపాదించుకుని పిల్లలకి  మహా అయితే ఎడ్యుకేషన్ వరకు ఇచ్చి వదిలేసి తమ కాళ్ల మీద బతకమంటారు. 

ఆ గ్యాప్ ని మనవాళ్లు ఫిల్ చేసి ఉన్న దాంతో సంతృప్తి చెందుదామనే కాన్సెప్ట్ లేకుండా సంపాదనే ధ్యేయంగా అడుగులు ముందుకేస్తున్నారు. 

“పిల్లలు పెద్దవుతున్నారు. మన కల్చర్ తప్పుతారు. ఇండియన్ సంబంధం దొరకడం కష్టమవుతుందేమో” లాంటి ఓల్డ్ స్కూల్ నుంచి బయటికొచ్చి అక్కడి వాళ్ళని లవ్ చేసామంటే పెళ్లి చేయడానికి కూడా సిద్ధపడుతున్నారు. 

తాము ఇండియన్స్ అయినా తమ పిల్లలు అమెరికన్స్ కనుక వాళ్లు పుట్టిన దేశం కల్చర్ కి తగ్గట్టుగా పెరగడానికి కొంతమంది తల్లిదండ్రులు అభ్యతంతరం చెప్పట్లేదు. ఆ విధంగా సెకండ్ జెనెరేషన్ అక్కడ పూర్తిగా జెండా పాతేస్తోంది. 

ఈ మార్పులన్నీ అమెరికా భవిష్యత్తులో మరింత ఇండియనైజ్ అవుతుందనేదానికి సంకేతాలు. ఈ పాజిటివ్స్ తో పాటు మనవాళ్లు అక్కడ ఎదుర్కోవల్సిన నెగెటివ్స్ కూడా ఉంటాయి. 

ఈ ఆధిపత్యాన్ని అందరూ తట్టుకోలేరు. అసూయతో ద్వేషం పెంచుకుని రేసిజం దాడులు చేస్తారు. ఇప్పటికే అక్కడక్కడ చూస్తున్నాము. అవి మరింత పెరగకుండా ఉండలాంటే మన వాళ్ళు ఐసొలేషన్లో కాకుండా అందరితోటి మమేకమైపోయి బతకాలి. అదొక్కటే మార్గం.  

హరగోపాల్ సూరపనేని

8 Replies to “అమెరికాని ఆక్రమించుకుంటున్న భారతీయులు”

  1. Jealousy actually from fellow Indians tons of anf round the clock. Root cause of several problems are celebrating junk parties and inviting other Indians to display the wealth whatever they earned.

  2. nuvvu cheppinantha INDIANS AMERIKA LO LERU ..INNIKOTLA AMERICA LO AMERICANS THARUVATHA CHINES EKKUVA UNNARU…INDIANS MAHA AYITHE ARAKOTI OR 60 LAKSHALUNTARU..30 KOTLA AMERICA JANABA LO ARAKOTI INDIANS ANTE THAKKUVE MARI

  3. నిజం చెప్పు వెనకటి రెడ్డి.. ఎవరో nri తెలుగు పిల్లాడు నిన్ను బాగా కెలికాడు కదా.

    అమెరికా లో ఇల్లు అమ్మేశావా, ఇన్ని నీతులు చెబుతున్నావ్, అమెరికా వద్దు అని వేరే కులం ఇంటి పేరు తో.

  4. మొన్నీమధ్య నా NRI ఫ్రెండ్స్ నాకు చెప్పిన విషయాలు కాస్త ఆశ్చర్యం కలిగించాయి. అమెరికా లోని భారతీయులు అమెరికా భవిత మీద బొత్తిగా నమ్మకం లేదట. అందుకే అందరూ ఒక కాలు ఇండియా లో ఇంకోకాలు అమెరికాలో పెట్టుకుని జీవితిస్తున్నారు అని. అక్కడి రాజకీయాలు ఆర్థిక వ్యవస్థలు చిన్నా బిన్నం అయ్యాయి అట. మన వాళ్లకు కష్ట కాలం మొదలైందట.

  5. అమెరికా..ఆర్ధిక..వ్యవస్థ..నాశనము..కావడానికి..కారణమూ..ఇండియన్స్. ప్రతి..ఇండియన్..కు..చిన్న పాటి..సాఫ్ట్వేర్..కంపెనీ..ఉంటుంది, ఎంత..తక్కువ..లేదన్న..10..మంది..ఉద్యోగస్తులు..వుంటారు. కరోనా..టైములో..ప్రతి..ఉద్యోగస్తుడికి..3..నెలల..జీతము..ఎలిజిబిలిటీ..లేకున్నా..అక్రమంగా..తీసుకొని..వేల..బిలిన్..డాలర్స్…fraud..చేశారు..వెదవలు, ఆ డబ్బుతో..భూములో ..ఇల్లు..కొని ..పాపపు..సొమ్ము..తింటున్న..నీచులు,US..GOVT.. ఈ..వెధవలను..ఉరితీయాలి.

Comments are closed.