ఆ రెండింట్లో సునీల్ కు చాన్స్

పుష్ప సినిమాతో మళ్లీ ఎక్కడికో దూసుకువెళ్లిపోయాడు కమెడియన్ సునీల్. ముఖ్యంగా తమిళ సినిమా జనాలకు భలే నచ్చేసాడు. అందులోనూ శంకర్ – రామ్ చరణ్ సినిమాలో చేస్తున్నాడు కదా. దాంతో ఇప్పుడు సునీల్ చేతిలోకి…

పుష్ప సినిమాతో మళ్లీ ఎక్కడికో దూసుకువెళ్లిపోయాడు కమెడియన్ సునీల్. ముఖ్యంగా తమిళ సినిమా జనాలకు భలే నచ్చేసాడు. అందులోనూ శంకర్ – రామ్ చరణ్ సినిమాలో చేస్తున్నాడు కదా. దాంతో ఇప్పుడు సునీల్ చేతిలోకి నాలుగు తమిళం సినిమాలు వచ్చి పడ్డాయి. వారంలో సగం రోజులు అక్కడే వుంటున్నాడు.

ఇదిలా వుంటే సునీల్ ఆప్త మిత్రుడు త్రివిక్రమ్ – మహేష్ బాబు సినిమా స్టార్ట్ కాబోతోంది. అంతకు ముందు అదే కాంబినేషన్ లో చెేసిన అతడు, ఖలేజా సినిమాల్లో మహేష్ తో సునీల్ కలిసి చేసిన ఫన్ మరచిపోలేనిది. అందుకే మళ్లీ ఆ కాంబినేషన్ ను త్రివిక్రమ్ పక్కా ఫిక్స్ చేసుకున్నారని తెలుస్తోంది. అయితే ఈ క్యారెక్టర్ ఏమిటి? ఎలా? అన్నది ఇంకా ముందు ముందు తెలుస్తుంది.

ఇదిలా వుంటే ఎన్టీఆర్ తో కొరటాల శివ చేయబోయే సినిమాలో కూడా సునీల్ నటించబోతున్నట్లు తెలుస్తోంది. సునీల్ కోసం ఓ మంచి పాత్రను సృజిస్తున్నట్లు తెలుస్తోంది. 

ఈ రెండూ కాక పుష్ప2… హరిహర వీరమల్లు సినిమాల్లో వుండనే వున్నాడు.. అంటే బన్నీ, చరణ్, ఎన్టీఆర్, మహేష్, పవన్ ఇలా పెద్ద హీరోల అందరి సినిమాల్లో సునీల్ కనిపించబోతున్నాడన్నమాట.