వరుణ్ సందేశ్ కౌంటర్ దాదాపు క్లోజయ్యింది. నాని డౌనయ్యాడు..నిఖిల్ ఒక్క సినిమా తరువాత మరో సినిమా అన్నట్లవున్నాడు. దీంతో ఆది, సందీప్ కిషన్ ల పని బాగుంది. చకచకా సినిమాల్లో బుక్ అవుతున్నారు. వరుసగా రెండు ఫ్లాపులు వచ్చినా ఆది చేతిలో ఇప్పుడు నాలుగు సినిమాల వరకు వున్నాయి. సందీప్ కిషన్ పరిస్థితి కూడా అలాగే వుంది.
ఈవారం రారా కృష్ణయ్యా విడుదల అవుతోంది. దీనిపై చాలా హోప్ తో వున్నాడు. ఏమాత్రం పాజిటివ్ టాక్ వచ్చినా మరో రెండుమూడు ఆఫర్లు గ్యారంటీ. మొత్తం మీద చిన్న నిర్మాతలకు మీడియం హీరోలు ఇద్దరు రెడీ గావున్నారు. నిఖిల్, సుధీర్ కుమార్, సుమంత్ అశ్విన్, లాంటివాళ్లు కాస్త స్పీడవ్వాలి. అవున్న అన్నట్లు సుశాంత్ ఎక్కడా? స్వంత సినిమాలేనా..ఇలాంటి పోటీలోకి దిగే ఉద్దేశం లేదా?