మరణించి ఏ లోకాన వున్నాడో కానీ వేటూరి ఓసారి చిన్న చమత్కారం చేసారు. తెలుగు సినిమా పరిశ్రమకు 'సన్'స్ట్రోక్ తగిలింది అన్నది ఆయన చమత్కారం. అంటే వారసుల స్ట్రోక్ అని. అది నిజమే కదా..ఇప్పుడు ఇంకో వారసుడు రాబోతున్నాడు. అదీ సూపర్ స్టార్ కృష్ణ ఇంటి నుంచే.
Advertisement
విజయనిర్మల తనయుడు, సీనియర్ నరేష్ కొడుకు నవీన్ తెరగ్రేటం చేయబోతున్నాడు. ఇందుకు రంగం అంతా సిద్ధమైందని, కృష్ణవంశీ శిష్యుడు రామ్ ప్రసాద్ దర్శకుడు అన్నది వార్తల సారాంశం. అందరు వారసుల్లాగే డ్యాన్సులు, ఫైట్లు చకచకా నేర్చేసుకుని, అవన్నీ తెరపై ప్రదర్శించడానికి రెడీ అయిపోతున్నాడట నవీన్.