ఆ ఇద్దరికి మరో చాన్స్

ఎంవివి సత్యనారాయణ విశాఖలో బడా బడా బిల్డర్. కానీ సినిమాల్లో మాత్రం అంతగా లక్ సరిపోవడం లేదు. గీతాంజలి ఫరవాలేదు. శంకరాభరణం ఇబ్బంది పెట్టింది. లక్కున్నోడు అయితే ఎనిమిది కోట్లు మింగేసింది. ఆ తరువాత…

ఎంవివి సత్యనారాయణ విశాఖలో బడా బడా బిల్డర్. కానీ సినిమాల్లో మాత్రం అంతగా లక్ సరిపోవడం లేదు. గీతాంజలి ఫరవాలేదు. శంకరాభరణం ఇబ్బంది పెట్టింది. లక్కున్నోడు అయితే ఎనిమిది కోట్లు మింగేసింది. ఆ తరువాత మళ్లీ ప్రాజెక్టు సెట్ కాలేదు.

మళ్లీ ఇన్నాళ్లకు కోన వెంకట్ తో కలిసి మరో వెంచర్ స్టార్ట్ చేసారు. ఆది పినిశెట్టి, తాప్సీ లతో కలిసి ఓ కామెడీ థ్రిల్లర్ కు శ్రీకారం చుడుతున్నారు. తాప్సీది కీలకపాత్ర. ఆది పినిశెట్టి హీరోగా సపోర్ట్ చేసే పాత్ర పోషిస్తున్నారు.

ఈ సినిమాకు దర్శకుడు హరి. గతంలో లవర్స్ అనే సినిమాను సూర్య దేవర నాగవంశీ, మహేంద్రల నిర్మాణంలో అందించిన దర్శకుడు. సప్తగిరి మగజాతి ఆణిముత్యం అంటూ అలరించింది ఈ సినిమాలోనే. ఆ తరువాత మళ్లీ సరైన సినిమా పడలేదు. ఇప్పుడు ఇతగాడు అందిస్తున్న కామెడీ థ్రిల్లర్ కథకు కోన వెంకట్, భవానీ ప్రసాద్ మాటలు అందిస్తున్నారు. టోటల్ ప్రాజెక్టును కోన చూసుకుంటారు. హైదరాబాద్ లో స్టార్ట్ అయి విజయవాడ, విశాఖల్లో షూటింగ్ జరుపుకుంటుందీ సినిమా.

ఎంవివికి మంచి సినిమా పడాల్సి వుంది. అలాగే డైరక్టర్ హరికీ సరైన సినిమా లేదు. ఇప్పుడు ఈ ఇద్దరికి ఓ మాంచి హిట్ అవసరమే. మరి కోన ప్రాజెక్టు వాళ్ల కోరిక తీరుస్తుందేమో? చూడాలి.