అందరు దర్శకులు ఒకలా వుండరు. కొందరికి ఏదో సమ్ థింగ్ డిఫరెంట్ గా చేయాలని వుంటుంది. విఐ ఆనంద్ కూడా అలాంటి కోవకు చెందినవాడే. నిఖిల్ ఎక్కడికి పోతావు చిన్నవాడా సినిమాతో తనేంటో నిరూపించకున్న ఇతగాడికి తరువాతి సినిమా అల్లు శిరీష్ తో వచ్చింది.
శిరీష్ ఇంకా చాలా ప్రూవ్ చేసుకోవాల్సిన హీరో. అందువల్ల ఎవరైనా సమ్ థింగ్ డిఫరెంట్ గా చేయడానికి కాస్త ముందు వెనుక ఆలోచిస్తారు. కానీ ఆనంద్ ఈసారి కూడా డిఫరెంట్ థ్రిల్లర్ ను అందించడానికే ముందుకు వెళ్తున్నాడు.
ఇలాంటి సినిమాలతో ఓ సమస్య వుంది. లాజిక్ లు లేకుండా హర్రర్ సినిమాలో హర్రర్ కామెడీలో అందించేస్తే జనం ఏమీ అనరు. కానీ, అలా కాకుండా కాస్త ఇంటలెక్చ్యువల్ సినిమా చూపించాలని అనుకుంటే మాత్రం సవాలక్ష పీకులు పీకుతారు. ఈ విషయం తెలిసి కూడా ఆనంద్ ఒక్కక్షణం అంటూ పారలల్ లైఫ్, లైఫ్ ఆఫ్టర్ లైఫ్ వంటి క్లిష్టమైన సబ్జెక్ట్ ను తలెకెత్తుకున్నాడు.
13బి, మనం సినిమాల ద్వారా ఇలాంటి టిపికల్ సబ్జెక్ట్ లు డీల్ చేయగలనని విక్రమ్ కుమార్ నిరూపించుకున్నాడు. ఇప్పుడు ఆనంద్ కూడా అదే బాటలో వున్నట్లు వుంది. ఎందుకంటే ఒక్క క్షణం టీజర్ చూస్తుంటే, మొదటి నుంచీ ప్రేక్షకులను తన సబ్జెక్ట్ కు ప్రిపేర్ చేసే పని స్టార్ట్ చేసినట్లు వుంది.
చూడాలి ఈ పనిలో ఏ మేరకు విజయం సాధిస్తాడన్నది.