ఆ ఇద్దరినీ మోసింది చాలు

రెండు మూడేళ్లుగా తెలుగు చిత్ర పరిశ్రమ సంగీత దర్శకుల విషయంలో చాలా కొరత ఎదుర్కొంటోంది. అయితే దేవిశ్రీప్రసాద్‌ లేదంటే తమన్‌ అన్నట్టుగా తయారైంది పరిస్థితి. ప్రతి పెద్ద సినిమాకీ వీరిద్దరిలో ఎవరో ఒకరు మ్యూజిక్‌…

రెండు మూడేళ్లుగా తెలుగు చిత్ర పరిశ్రమ సంగీత దర్శకుల విషయంలో చాలా కొరత ఎదుర్కొంటోంది. అయితే దేవిశ్రీప్రసాద్‌ లేదంటే తమన్‌ అన్నట్టుగా తయారైంది పరిస్థితి. ప్రతి పెద్ద సినిమాకీ వీరిద్దరిలో ఎవరో ఒకరు మ్యూజిక్‌ చేస్తున్నారు. దీంతో సహజంగానే క్వాలిటీ పడిపోయింది. 

తెలుగు సినిమాల్తో పాటు ఇద్దరూ తమిళంలో కూడా చేస్తుంటారు కాబట్టి వీరిపై గట్టిగా ప్రెజర్‌ పెట్టి మ్యూజిక్‌ చేయించుకునే వీలు లేకుండా పోయింది. కీరవాణి, మణిశర్మ ఇద్దరూ పాతబడిపోవడం… ఇతర భాషా సంగీత దర్శకులు ఇక్కడ బిజీ కాలేకపోవడంతో ఈ ఇద్దరే తెలుగు సినీ సంగీత సామ్రాజ్యాన్ని ఏలుతున్నారు. 

ఇప్పుడు వీరికో ప్రత్యామ్నాయం దొరికింది. చాలా సినిమాలకి సంగీత దర్శకత్వం వహించినా కానీ ఇంతకాలం స్టార్‌ మ్యూజిక్‌ డైరెక్టర్‌ అనిపించుకోలేకపోయిన అనూప్‌ ఇప్పుడిప్పుడే నెక్స్‌ట్‌ లెవల్‌కి వస్తున్నాడు. మనం తర్వాత అనూప్‌ని పెద్ద చిత్రాల నిర్మాతలు కూడా సీరియస్‌గా తీసుకుంటున్నారు. గోపాలా గోపాలాతో పాటు ఎన్టీఆర్‌, పూరి జగన్నాధ్‌ చిత్రాన్ని దక్కించుకున్న అనూప్‌ ఇక తమన్‌, దేవిలకి ఎంతవరకు పోటీ ఇస్తాడో, వారికేమాత్రం సాటి రాగలడో చూడాలి.