సునీల్‌కి ఓ రేంజ్‌లో తిరిగింది

కామెడీ వేషాలు మానేసి హీరోగా మాత్రమే చేస్తున్న సునీల్‌కి ఇప్పుడు టైమ్‌ చాలా బాగుంది. అతను హీరోగా నటించిన గత రెండు చిత్రాలు ఆశించిన స్థాయిలో ఆడకపోయినా కానీ సునీల్‌తో సినిమాలు తీసేందుకు స్టార్‌…

కామెడీ వేషాలు మానేసి హీరోగా మాత్రమే చేస్తున్న సునీల్‌కి ఇప్పుడు టైమ్‌ చాలా బాగుంది. అతను హీరోగా నటించిన గత రెండు చిత్రాలు ఆశించిన స్థాయిలో ఆడకపోయినా కానీ సునీల్‌తో సినిమాలు తీసేందుకు స్టార్‌ ప్రొడ్యూసర్లు కూడా ఉత్సాహం చూపుతున్నారు. 

అనిల్‌ సుంకర నిర్మాతగా సునీల్‌ హీరోగా గోపీమోహన్‌ దర్శకత్వంలో ఓ చిత్రం తెరకెక్కనుంది. దిల్‌ రాజు కూడా సునీల్‌ హీరోగా ఒక సినిమా తీసేందుకు సన్నాహాల్లో ఉన్నాడని తెలిసింది. జోష్‌ దర్శకుడు వాసు వర్మ దర్శకత్వంలో సునీల్‌ హీరోగా దిల్‌ రాజు బ్యానర్‌లో త్వరలోనే ఓ చిత్రం మొదలు కానుంది. 

ఇవి కాకుండా సునీల్‌ హీరోగా మారుతి దర్శకత్వంలో ఒక సినిమా కన్‌ఫర్మ్‌ అయింది. తనికెళ్ల భరణి దర్శకత్వంలో సునీల్‌తో భక్త కన్నప్ప చిత్రం రూపొందుతోందనే సంగతి తెలిసిందే. సునీల్‌ ఇంతకుముందు దర్శకులు, నిర్మాతల కోసం వెతుక్కోవాల్సి వచ్చేది. ఇప్పుడు స్టార్‌ ప్రొడ్యూసర్లే ఎదురెళ్లి ఆఫర్లు ఇచ్చేస్తున్నారంటే… సునీల్‌ రేంజ్‌ పెరిగినట్టే అనుకోవాలి.